‘పడి పడి లేచె మనసు’ మూవీ అప్డేట్స్

‘పడి పడి లేచె మనసు’ మూవీ అప్డేట్స్

ఫుల్ ఫాంలో ఉన్న టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్‌ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. శర్వానంద్ ఈ మధ్య నటించి విడుదలైన చిత్రం ‘మహానుభావుడు’. ఈ చిత్రం మంచి హిట్ సాధించింది. శర్వానంద్ కు ఉన్న గుర్తింపు ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. హీరోయిన్ సాయిపల్లవి సైతం చాలా తక్కువ సమయంలోనే గొప్ప నటిగా పేరు సంపాదించింది. ఇలాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు కలిసి ఓ సినిమా చేస్తున్నారంటే ఉండే ఆసక్తే వేరు. వీళ్లను హీరో హీరోయిన్లుగా పెట్టి హను రాఘవపూడి తీస్తున్న సినిమా ‘పడి పడి లేచె మనసు’. శ‌ర్వానంద్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా మార్చి 6వ తేదీన ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ మరియు టైటిల్ విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించింది.

‘ఫిదా’ సినిమాతో తెలుగు వారంద‌ర్నీ ఫిదా చేసింది త‌మిళ భామ సాయి ప‌ల్ల‌వి. ఆ త‌ర్వాత నానితో ఆమె చేసిన ‘ఎమ్‌సీఏ’ సినిమా కూడా ఘ‌న‌విజయం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ రోజు సాయి ప‌ల్ల‌వి జ‌న్మ‌దినం. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ మ‌రో పోస్టర్‌ను విడుద‌ల చేసింది. ఈ పోస్టర్‌లో బెంగాలీ త‌ర‌హా చీర‌కట్టుతో సాయిప‌ల్ల‌వి మెస్మ‌రైజ్ చేస్తోంది. బస్సెక్కడానికి సాయిపల్లవి పరుగులు తీస్తుంటే ఆమెను అనుసరిస్తున్నాడు శర్వానంద్. బ్యాక్ డ్రాప్ అంతా కూడా ఆకర్షణీయంగా ఉంది. ఈ చిత్రం కలకత్తా నగర నేపథ్యంలో సాగే ప్రేమకథ అని సమాచారం.
నటీనటులు : శర్వానంద్, సాయి ప‌ల్ల‌వి
ద‌ర్శ‌క‌త్వం : హను రాఘవపూడి
బ్యానర్ : శ్రీల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్
సంగీతం : విశాల్ చంద్రశేఖర్
ప్రొడ్యూసర్స్ : సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ : App store: https://goo.gl/JHgg83

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here