మహాభినేత్రి సావిత్రికి సమర్పించిన ఘన నివాళి ‘ మహానటి ‘

మహాభినేత్రి సావిత్రికి సమర్పించిన ఘన నివాళి మహానటి,Telugu Filmnagar,Telugu Film News 2018,Latest Telugu Cinema News,Tollywood Movie Updates,A Great Tribute To Mahanati Savitri,Mahanati Movie Updates,Mahanati Telugu Movie Latest News,Mahanati Movie Review,Mahanati Telugu Movie Review

తెలుగులో బయోపిక్ ల ట్రెండుకు శ్రీకారం చుడుతూ ఈరోజు విడుదలైన’మహానటి’ ఆ దివంగత మహానటి సావిత్రికి నిజమైన ఘన నివాళిగా నిలుస్తుంది. బయోపిక్ ప్రక్రియ తీసినవాళ్లకే కాకుండా చూడబోయేవారికి కూడా ఒక సరికొత్త ప్రయోగం కావడంతో తెర మీద ఆవిష్కృతమవుతున్న ఒక్కో సన్నివేశం ఒక్కో అనుభూతిని ప్రేక్షకులకు పరిచయం చేసింది.ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ఆరాధ్య నటి అయిన సావిత్రి జీవితంలో తమకు తెలిసిన తెలియని సంఘటనలను రిలేట్ చేసుకుంటూ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు . ఇక సినిమాను డీల్ చేసిన విధానాన్ని విశ్లేషించుకుంటే దీనినొక గొప్ప ఆవిష్కరణగా అభినందించవచ్చు.
స్వతహాగా డాక్యుమెంటరీ ఫీచర్స్ ఉండే ఇలాంటి బయోపిక్ లలో మెలోడ్రామాకు ,ఎంటర్టైన్మెంట్ కు అవకాశం చాలా తక్కువుగా ఉంటుంది.కానీ ఆ అవరోధాన్ని చాలా తెలివిగా ,చాలా comfortable గా ఓవర్ కమ్ చేసాడు దర్శకుడు.ప్రేక్షకులు కూడా ఒక రెగ్యులర్ సినిమాను ఎంజాయ్ చేసినట్టే ఎంజాయ్ చేయగల అంశాలు ఇందులో చాలా వున్నాయి. ముఖ్యంగా సావిత్రి ఒరిజినల్ క్యారెక్టర్ లోనే బోలెడంత బోల్డ్నెస్,హ్యూమర్,గ్లామర్ ఉండటంతో ఆ క్యారెక్టర్ లోని ఒరిజినల్ స్పిరిట్ ఇంస్పిరేషన్తో సన్నివేశాలను చాలా అందంగా, ఆహ్లాదంగా మలుచుకోగలిగాడు దర్శకుడు నాగ అశ్విన్.ఇక రెండు దశాబ్దాలపాటు తెలుగు, తమిళ చిత్ర రంగాలను శాసించిన సావిత్రీ కి ఇరు పరిశ్రమల ప్రముఖులతో వృత్తిపరమైన,వ్యక్తిగతమైన అనుబంధాలు ఉన్నప్పటికి వాటన్నింటిని చూపిన్చేసేయాలి అని దర్శకుడు ఆత్ర పడకపోవడమే ‘మహానటి’ ఇంత క్రిస్పీగా,ఇంత ఆసక్తికరంగా రావటానికి కారణమైంది.ఏ పాత్రను ఏ పరిధి మేరకు వాడుకోవాలో ముందుగానే పేపర్ ఎడిటింగ్ చేసుకున్నట్లున్నాడు డైరెక్టర్. అందుకేనేమో వాళ్ల వాళ్ల ఇమేజ్ పరంగా ఎంత ప్రముఖులైనప్పటికీ ఇందులో కథావసరం మేరకే వారి పాత్రలను ఉపయోగించుకోవడం బాగుంది. ఇక మోస్ట్ అవైటెడ్ పాయింట్… సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ ఎలా ఉంది ..ఎలా చేసింది అన్నదే.ఆ పాత్రకు ఆమెను సెలక్ట్ చేసుకోవటం గొప్ప నిర్ణయమని సినిమా చూసిన ప్రతి ఒక్కరి అభిప్రాయం. వ్యక్తిగా సావిత్రి ,నటిగా సావిత్రి అనే రెండు విభిన్న పార్శ్వాలను చాలా చక్కగా, చాలా చలాకీగా,అభినయించింది కీర్తి.నిజానికీ ప్రెజంట్ జనరేషన్ హీరోయిన్లలో ఏ హీరోయిన్ కు రాని అద్భుతమైన ఆఫర్ కీర్తికి వచ్చి నందుకు ఆమె దాన్ని నూటికి నూరు పాళ్ళు నిలబెట్టుకుంది. ఇక dulquer సల్మాన్ పోషించిన జెమినీ గణేషన్ పాత్ర ని ఎలా డీల్ చేశారో అనే ఆతృత ప్రతి ఒక్కరి లో కనిపించింది, నిజానికి సావిత్రి అభిమానుల అందరికి జెమినీ గణేషన్ ఒక విలన్ కానీ ఇందులో ఎవరి పాత్ర ని జడ్జి చేయటానికి దర్శకుడు పూనుకోలేదు. డైరెక్టర్ రెండు పార్లల్ స్టోరీస్ ని నడిపిన విధానం అద్భుతం. He just presented characters how they were and what they were. ఇక ముందు రాబోయే బయోపిక్ లకు ఈ మహానటి ఒక guideline గా నిలుస్తుంది. ఇక మధుర వాని గా సమంత అంథోనీ గా విజయ్ దేవరకొండ ల మధ్య నడిచే లవ్ ట్రాక్ చాలా డీసెంట్ గా నడిచింది.క్లైమాక్స్ లో సమంత పెర్ఫార్మెన్స్ కంటతడి పెట్టించింది, చప్పట్లు కొట్టించింది. ఆనాటి ప్రముఖుల పాత్ర ల్లో నటించిన ఈనాటి ప్రముఖులు మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, క్రిష్, తరుణ్ భాస్కర్, రాజేంద్ర ప్రసాద్, నరేష్ ఆయా పాత్రలకి బెస్ట్ ఛాయిస్ అనిపించారు. ఇంక అది ఇది అని కాకుండా ఆర్టిస్టుల పరం గా టెక్నిషన్స్ పరం గా మహానటి ని ఒక సమగ్రమైన బయోపిక్ గా అభినందించవచ్చు. ముఖ్యం గా కాస్ట్యూమ్స్ సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ ల పని తీరు సింప్లీ సుపెర్బ్. ఎన్ని ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలను నిర్మించిన వైజయంతి మూవీస్ అధినేత అశ్వని దత్ కు ఆయన కుమార్తెలు స్వప్న ప్రియాంక ఇద్దరు ఇచ్చిన అపురూప కానుక మహానటి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here