రామ్ చరణ్ – బోయపాటి @ బ్యాంకాక్… 

రామ్ చరణ్ – బోయపాటి @ బ్యాంకాక్,Telugu Filmnagar,Latest Telugu Movies News 2018,Telugu Film News,Tollywood Movie Updates,Ram Charan And Boyapati At Bangkok,Ram Charan And Boyapati Srinu Team to fly Bangkok,Ram Charan will fly to Bangkok for his next with Boyapati Srinu,Ram Charan flies to Bangkok for shoot,Ram Charan & Boyapati Srinu film Bangkok schedule will begin from May 12,Ram Charan to begin shooting in bangkok for boyapati upcoming movie

రంగస్థలం సినిమాతో కెరీర్ లో ది బెస్ట్ హిట్ అందుకున్న రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాతో కూడా అదే తరహాలో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డి. వి. వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో,  స్టార్ ప్రొడ్యూసర్ డి. వి. వి దానయ్య నిర్మాణంలో సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్ మొదటి షెడ్యూల్ ని చాలా స్పీడ్ గా ఫినిష్ చేశారు. హైదరాబాద్ లోని ప్రముఖ అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ యాక్షన్ సీన్స్ ని చిత్రీకరించారు. అలాగే కొన్ని ఫ్యామిలీ సీన్స్ ని కూడా స్పెషల్ సెట్స్ వేసి రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేశారు. 20 రోజుల షెడ్యూల్ లో రామ్ చరణ్, ప్రశాంత్, స్నేహ, కైరా అద్వానీలతో పాటు ప్రధాన పాత్రలపై సన్నివేశాలను చిత్రీకరించారు.
తదుపరి షూటింగ్ కోసం చిత్ర యూనిట్ బ్యాంకాక్ వెళుతోంది. బ్యాంకాక్ లో షూటింగ్ 15 రోజుల పాటు జరగనున్నట్లు సమాచారం. బ్యాంకాక్ లో మే 12 నుండి ఈ షెడ్యూల్ ప్రారంభవమవుతుంది. మెగా అభిమానులను, ప్రేక్షకులని అలరించే విధంగా రామ్ చరణ్ ని సరికొత్త యాంగిల్ లో పరిచయం చేయనున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. రామ్ చరణ్ పై చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు చిత్రానికి హైలైట్‌గా నిలవనున్నాయట. పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను తీర్చిదిద్దుతున్నారు అని వ్యాఖ్యానించారు నిర్మాత డి. వి. వి దానయ్య.
నటీనటులు : రామ్ చరణ్, కైరా అద్వానీ, ప్రశాంత్, వివేక్ ఒబెరాయ్, స్నేహ
డైరెక్టర్ : బోయపాటి శ్రీను 
నిర్మాత : డి. వి. వి దానయ్య
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
స్టిల్స్ : జీవన్ 
మాటలు : ఎం. రత్నం 
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి :http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ : App store: https://goo.gl/JHgg83

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here