పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా ‘నేల టికెట్’ ఆడియో

Latest Telugu Movies News 2018, Nela Ticket Movie Updates, Nela Ticket Telugu Movie Latest News, Pawan Kalyan As Chief Guest For Mass Maharaja Ravi Teja Nela Ticket Telugu Movie Audio Launch, Pawan Kalyan as Chief Guest for Nela Ticket Audio, Powerstar Pawan Kalyan As Chief Guest For Ravi Teja Nela Ticket Movie Audio Launch, Telugu Film News, Telugu Filmnagar, Tollywood Movie Updates, పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా నేల టికెట్ ఆడియో

మాస్ మహారాజ రవితేజ నటించిన తాజా చిత్రం ‘నేల టికెట్టు’. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తైపోయింది.  మాళవిక శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో వేడుకతో అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించడానికి సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో ఈ నెల 10వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ వేడుకను ఆరంభించనున్నారు. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధి కానుండటంతో ఆధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశాలున్నాయి. ఇందుకోసం భారీగా ఏర్పాట్లతోపాటు భద్రతా చర్యలు చేపట్టే దిశగా చర్యలు తీసుకొంటున్నారు. దర్శకుడిగా కల్యాణ్ కృష్ణ ఇప్పటికే రెండు హిట్లు కొట్టేసి వున్నాడు. అందువలన ఆయన ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే పట్టుదలతో వున్నాడు. ఈ దర్శకుడి ఆశ నెరవేరుతుందేమో చూడాలి మరి.
నటీనటులు : రవితేజ , మాళవిక శర్మ, జగపతిబాబు, అలీ తదితరులు.
దర్శకుడు : కళ్యాణ్ కృష్ణ
నిర్మాత : రామ్ తాళ్ళూరి
సంగీతం : శక్తికాంత్ కార్తీక్
ఎడిటింగ్ : చోటా కే ప్రసాద్
మాటలు : సత్యానంద్

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి : http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ : App store: https://goo.gl/JHgg83

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here