మహానటి లో ఘటోత్కజుడు గా మోహన్ బాబు

మహానటి లో ఘటోత్కజుడు గా మోహన్ బాబు,Telugu Filmnagar,Latest Telugu Movies News 2018,Telugu Film News,Tollywood Movie Updates,Mohan Babu as Ghatotkacha in Mahanati,Mohan Babu As SVR in Mahanati Movie,Actor Mohan Babu as Ghatotkacha In Mahanati Telugu Movie

వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వం లో లెజండరీ యాక్ట్రెస్ సావిత్రి జీవిత చరిత్ర “మహానటి “సినిమా గా రూపొందింది.సావిత్రి గా కీర్తి సురేష్నటించిన, భారీతారాగణంతో రూపొందించిన ఈ సినిమా 9వ తేదీ రిలీజ్ కాబోతుంది.మహానటి సినిమా తొలి తెలుగు బయోపిక్ మూవీ.

కె వి రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్, ఏఎన్నార్,యస్ వి ఆర్,సావిత్రి నటించిన మాయాబజార్ సినిమా 1957 సంవత్సరం లో రిలీజయి ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో విలక్షణ నటుడు ఎస్ వి రంగారావు ఘటోత్కచుడు గా విశ్వరూపం ప్రదర్శించిన విషయం విదితమే. ఆ సినిమా లోని వివాహభోజనంబు సాంగ్ న భూతో న భవిష్యతి.

మహానటి సినిమాలో మాయ బజార్ సినిమా సన్నివేశం లో ప్రఖ్యాత దర్శకుడు క్రిష్, దర్శకుడు కె వి రెడ్డిగా, ఘటోత్కజుడు గా నటించిన యస్ వి రంగారావు గా సీనియర్ నటుడు,నిర్మాత కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించారు. ఘటోత్కజుడు గా నటించిన మోహన్ బాబు ఫస్ట్ లుక్ ను 6వ తేదీ రిలీజ్ చేశారు.మోహన్ బాబు గెటప్ అచ్చుగుద్దినట్టుగా యస్వీఆర్ ను పోలివుంది. మోహన్ బాబు యస్ వి ఆర్ ను తలపించారు. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here