మెగా కాంపౌండ్ నుండి మరో హీరో అరంగ్రేట్రం!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో చిరంజీవి కుటుంబం అంత పెద్ద కుంటుంబం లేదు. తాజాగా చిరంజీవి కుటుంబం నుంచి మరొకరు తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టబోతున్నారు. స్టార్‌ల స్ఫూర్తిని కొనసాగిస్తూ వాళ్ల కుటుంబ సభ్యులు ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. వాళ్ల‌కు కేరాఫ్ చిరంజీవే. ప్రస్తుతం మెగా ఫ్యామిలీలోని హీరోల సంఖ్య డజనుకు చేరుకుంటుంది. అంద‌రూ చిరంజీవి ఆశీస్సుల‌తో సినీ ప‌రిశ్ర‌మ‌లోకి వ‌స్తున్నారు.

చిరంజీవి సోద‌రి విజ‌య‌దుర్గ కుమారుడు సాయిధ‌ర‌మ్ తేజ్ సినిమాల్లోకి వ‌చ్చి రాణిస్తున్నాడు. ఇప్పుడు ఇత‌డి సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ సినిమాల్లోకి వ‌స్తున్నాడ‌ట‌. పవన్ కళ్యాణ్ తో ఎక్కువ సన్నిహితంగా ఉండే వైష్ణ‌వ్ తేజ్ ఇప్పటికే నటన శిక్షణ ముగించుకొని, త్వరలో హీరోగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు అని స‌మాచారం. నిర్మాత సాయి కొర్రపాటి నిర్మాణంలో ఈ మెగా మేనల్లుడిని పరిచయం చేయబోతున్నాడట.

రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ల లాగా భిన్నమైన గుర్తింపు తెచ్చుకుంటాడా? లేక అల్లు శిరీష్ లాగా మిగిలిపోతాడా? అనేది వేచి చూడాల్సి ఉంది. మొత్తానికి మెగా ఫ్యామిలి అత్యధిక హీరోలు కలిగిన ఫ్యామిలీగా రికార్డులు తిరగరాస్తుందేమో వేచి చూడాల్సిందే.

మరిన్ని ఆసక్తిదాయక విషయాలు మరియు సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి :http://thetelugufilmnagar.com
తెలుగు ఫిలిం నగర్ దక్షిణ భారతదేశం యొక్క నెం . 1 యూట్యూబ్ ఛానల్. తెలుగు ఫిలిం ఇండ్రస్ట్రీ గురించి ఎన్నెన్నో ఆసక్తిదాయక విషయాలు తెలుసుకోవడానికి ఇదే ఆఖరి గమ్యస్థానం.
లైక్ – https://www.facebook.com/Telugufilmnagar
సబ్ స్క్రైబ్ – https://www.youtube.com/Telugufilmnagar
ఫాలో – https://www.twitter.com/Telugufilmnagar
మై మ్యాంగో యాప్ లింక్స్ : App store: https://goo.gl/JHgg83

 

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here