నా పేరు సూర్య ప్రీ రిలీజ్ వేడుక హైలెట్స్

#NSNI, #NSNIPreRelease, Allu Arjun Naa Peru Surya Naa Illu India Pre Release Event Highlights, Latest Telugu Film News, Naa Peru Surya Movie Pre Release Event Highlights, Naa Peru Surya Pre Release Event Highlights, Naa Peru Surya Telugu Movie Pre Release Event Highlights, Telugu Filmnagar, Telugu Movies News 2018, Tollywood Cinema Updates, నా పేరు సూర్య ప్రీ రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్ గా మెగా పవర్ స్టార్
29 వతేదీ హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియం లో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన  నా పేరు సూర్య సినిమా ప్రీ రిలీజ్ వేడుక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ముఖ్య అతిథి గా అత్యంత వైభవం గా జరిగింది. మే 4వ తేదీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ … నిజాయితీ తో కూడిన సినిమా ఒకటి చేయాలనే తన కోరిక తీరిందని,ప్రతీ ఒక్కరూ గర్వపడేలా ఈ సినిమా ఉంటుందని అన్నారు. రంగ స్థలం,భరత్ అనే నేను సినిమాలు ఘన విజయం సాధించినట్టుగానే తాను నటించిన నా పేరు సూర్య సినిమా ఘన విజయం పొందాలని కోరుకుంటున్నా నని,దర్శకరత్న దాసరి నారాయణరావు గారి పుట్టిన రోజు మే 4వ తేదీ ఈ సినిమా రిలీజవడం సంతోషం గా ఉందని,ముఖ్య అతిధి గా విచ్చేసిన రామ్ చరణ్ తేజ్ కు థ్యాంక్స్ చెప్పారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ .. ఈ ప్రపంచం లో కరప్షన్ లేని పరిశ్రమ చిత్ర పరిశ్రమేనని,అటువంటి చిత్ర పరిశ్రమ పై ఇటీవల వచ్చిన ఆరోపణల గురించి తన మనసు లోని బాధను వ్యక్తం చేశారు. రోజంతా ఎండా,వానా  లెక్క చేయకుండా తామంతా కష్టపడతామని,గాయాల పాల్పడినా తామంతా ప్రేక్షకుల ఆనందం కలిగించడానికి ఎన్ని కష్టాలనైనా ఓర్చుకుంటామన్నారు. మీడియా కు ఆ విషయాలు అన్నీ తెలుసని,అయినా ఏదేదో రాస్తారని అన్నారు.
డైరెక్టర్ వక్కంతం వంశీ మాట్లాడుతూ ..   సినీ ఇండస్ట్రీ కి నన్ను హీరో గా పరిచయం చేసిన దర్శక రత్న దాసరి గారి జయంతి రోజున నేను దర్శకత్వం వహించిన నా పేరు సూర్య సినిమా రిలీజవడం తనకు సంతోషంగా ఉందన్నారు. మెగా ప్రొడ్యూసర్ అరవింద్ ,చిత్ర నిర్మాతలు లగడపాటి శ్రీధర్,నాగబాబు,బన్నీ వాసు ప్రసంగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here