నాకు నచ్చలేదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్                                                                                 

నాకు నచ్చలేదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,I Do Not like It Say's Stylish Star Allu Arjun,Telugu Filmnagar,Telugu Movies News 2018,Latest Telugu Film News,Tollywood Cinema Updates,Allu Arjun Latest News,Stylish Star Allu Arjun Latest Speech,Allu Arjun Latest Speech From Naa Peru Surya Movie,Naa Peru Surya Telugu Movie Latest News,Naa Peru Surya Movie Updates
   మిలటరీ మాధవరం లో 22వ తేదీన వక్కంతం వంశీ దర్శకత్వంలో ఆర్మీ ఆఫీసర్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరిగింది.మే 4వ తేదీ ప్రపంచవ్యాప్తం గా రిలీజవబోతున్న నా పేరు సూర్య సినిమా రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందింది. హిందీ సంగీత దర్శకులు      విశాల్ -శేఖర్ సంగీతం సమకూర్చిన,ఆర్మీ నేపధ్యం లో భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా గురించి ప్రేక్షకులు,అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.
 ఆడియో ఫంక్షన్ లో చిత్ర సమర్పకుడు నాగ బాబు,నిర్మాత లగడపాటి శ్రీధర్ సినిమా గురించి,అల్లు అర్జున్ డెడికేషన్ గురించి ప్రశంసలు కురిపించారు.
 స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ .. నా పేరు సూర్య సినిమాలో నటించేంతవరకు మాధవరం అనే ఊరుందని,దానిని మిలటరీ మాధవరం అంటారని తనకు తెలియదు అన్నారు. ఇండియన్ ఆర్మీ లో చేరి దేశానికి సేవ చేయాలనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందినందున ఆర్మీ నేపధ్యం ఉన్న మిలటరీ మాధవరం నుండే సినిమా ప్రమోషన్ ను ప్రారంభించాలని అనుకున్నామన్నారు. సినిమా షూటింగ్ సమయం లో ఇండియన్ ఆర్మీ సహాయం మరువలేనిదన్నారు.
 మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాలలో ప్రవేశించినప్పటినుంచీ ఆయన పై రకరకాల విమర్శలు వినీ వినీ అలవాటు అయిపొయింది. టాలీవుడ్ లో నెంబర్ వన్ స్థానం లో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లగ్జరీ లైఫ్ కాదనుకుని,కోటానుకోట్ల రూపాయలను త్రోసిరాజని ప్రజలకు సేవ చేయాలనే తలంపు తో రాజకీయాలలో ఎంట్రీ యిస్తే ఎవడెవడో విమర్శిస్తున్నారు. ఈ మధ్యన ఆయన వ్యక్తిగత విషయాలలో తలదూర్చి కామెంట్స్ చేస్తున్నారు ,అది నాకు నచ్చలేదు అని అన్నారు.
మెగా స్టార్,పవర్ స్టార్,మెగా పవర్ స్టార్,స్టైలిష్ స్టార్ వంటి పేర్లతో మేము ఎంతమంది హీరోలం ఉన్నా, ఎవరి అభిమానులు వారికున్నా,అంతా మెగా కుటుంబానికి చెందిన వారమే,మేమంతా ఒకటేఅన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here