వరుస చిత్రాలతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ

వరుస చిత్రాలతో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Movie Updates,Vijay Deverakonda Upcoming Movies,Actor Vijay Deverakonda Latest News,Hero Vijay Deverakonda Upcoming Movie News,Vijay Deverakonda Next Film Updates

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘టాక్సీవాలా’ మే 18న ప్రేక్షకుల ముందుకి రానుంది. దీంతో విజయ్ తన తర్వాతి చిత్రాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన సైన్ చేసిన కొత్త సినిమాల్లో నూతన దర్శకుడు భరత్ కమ్మ సినిమా కూడా ఒకటి.

లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని జూన్ నుండి ప్రారంభించనున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటించనుంది. వరుస విజయాలను అందుకుంటున్న నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో విజయ్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనుండగా, రష్మిక క్రీడాకారిణిగా నటించనుంది. ఇకపోతే విజయ్ ‘మహానటి’ మరియు ‘నోటా’ చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. పెళ్లి చూపులు, అర్జునరెడ్డి వంటి వరుస విజయాలను అందుకున్న విజయ్ ఈ చిత్రాలతో తన విజయ పరంపర కొనసాగిస్తాడో లేదో చూడాలి మరి. ఎనీ హౌ అల్ ది బెస్ట్ విజయ్ దేవరకొండ.



Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here