మరోసారి బాలకృష్ణను డైరెక్ట్ చేయనున్న వి.వి వినాయక్

మరోసారి బాలకృష్ణను డైరెక్ట్ చేయనున్న వి.వి వినాయక్,Balakrishna And VV Vinayak New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Movie Updates,Nandamuri Balakrishna & Director VV Vinayak New Film Updates,Nandamuri Balakrishna Upcoming Movie News,VV Vinayak Next Film With Balakrishna

వివి వినాయక్ – బాలకృష్ణ కాంబినేషన్ లో 2002లో వచ్చిన ఫ్యాక్షన్ యాక్షన్ థ్రిల్లర్ చెన్నకేశవరెడ్డి చిత్రం అప్పట్లో ఓ ప్రభంజనం. బాక్సాఫీస్ వద్ద బాలయ్య స్టామినాను ప్రూవ్ చేసిన సినిమా అది. 16 ఏళ్ల తరువాత మరోసారి వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఓ చిత్రం మన ముందుకి రాబోతుంది. ఈ చిత్రాన్ని జై సింహ చిత్ర నిర్మాత సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవల సి. కళ్యాణ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో “ఈ చిత్రం షూటింగ్ ని మే 27న ప్రారంభం చేయనున్నాం” అని అన్నారు. కానీ, తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, మే 2వ తేదీనే చిత్రం మొదలు కాబోతుందని తెలిసింది. అయితే ఈ విషయం గురించి చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

ఇది ఇలా ఉండగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ మలయాళంలో ఘన విజయం సాధించిన మఫ్టీ అనే చిత్రానికి రీమేక్ గా రాబోతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అని అనుకున్నట్టుగా జరిగితే ఈ చిత్రం 2019 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వస్తుందట.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here