ఈ సారి సస్పెన్స్ థ్రిల్లర్ తో మనల్ని థ్రిల్ చేయనున్న సమంత

Another Big Star Joins Samantha Akkineni U Turn, Bhumika Chawla Joins Samantha Akkineni U Turn Movie, Latest Telugu Movies News, Samantha New Film, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates, U Turn Movie Shooting Updates, U Turn Movie Updates, U Turn Telugu Movie Latest News, ఈ సారి సస్పెన్స్ థ్రిల్లర్ తో మనల్ని థ్రిల్ చేయనున్న సమంత

రంగస్థలం చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్న సమంత ప్రస్తుతం తాజాగా “యూ టర్న్” అనే చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం అదే పేరుతో కన్నడలో విడుదలైన చిత్రానికి రీ-మేక్ గా వస్తుంది. కన్నడ ‘యూ టర్న్’ దర్శకుడు పవన్ ఈ తెలుగు ‘యూ టర్న్’ ని కూడా డైరెక్ట్ చేస్తుండడం విశేషం. “బెంగుళూరు ఫ్లైఓవర్” పై జరిగే వరుస అనుమానస్పద యాక్సిడెంట్స్ నేపథ్యంలో సాగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అక్కడ ఘన విజయం సాధించింది.
కొన్ని రోజుల క్రితమే మొదటి షెడ్యూల్ ని పూర్తిచేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ ని ప్రారంభించుకుంది. హైదరాబాద్ లోని ఓ భూత్ బంగ్లాలో వేసిన ఓ భారీ సెట్ లో జరుగుతున్న షూటింగ్ లో సమంత తో పాటు రాహుల్ రవీంద్రన్, ఆది పినిశెట్టిలు కూడా పాల్గొననున్నారు.

ఈ చిత్రంలో సమంత జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుండగా, ఆది పినిశెట్టి పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. కన్నడ చిత్రంలానే ఈ చిత్రం కూడా భారీ విజయం సాధిస్తుందని చిత్ర బృందం విశ్వసిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here