ఫ్యామిలీస్ తో రంగస్థలం సినిమా చూసిన బాబాయ్,అబ్బాయ్ 

ఫ్యామిలీస్ తో రంగస్థలం సినిమా చూసిన బాబాయ్ అబ్బాయ్,Telugu Filmnagar,Latest Telugu Movies News,Tollywood Movie Updates,Telugu Film News 2018,Pawan Kalyan Watched Rangasthalam with his Family,Rangasthalam Movie Updates,Rangasthalam Telugu Movie Latest News,Powerstar Pawan Kalyan Watched Rangasthalam Movie
 మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ్ ,సమంత నటించిన రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే.
గ్రామీణ నేపధ్యం లో వాస్తవికతతో రూపొందిన రంగస్థలం సినిమా రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తిరగ రాస్తుంది.ఇంతటి ఘన విజయం సాధించిన రంగస్థలం సినిమాకు ప్రేక్షకులే కాదు,సినీ ప్రముఖులు కూడా  బ్రహ్మరధం పట్టారు. మరి కొన్ని రోజులలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాలలో 4వ ప్లేస్ లో ఉన్న మగధీర సినిమాను సైతం అధిగమించనుంది.
  హైదరాబాద్ లోని ఐమ్యాక్స్ థియేటర్ లో రంగస్థలం సినిమాను ఫ్యామిలీ తో,ప్రేక్షకుల తో కలసి చూసి ఎంజాయ్ చేశారు. పవన్ కళ్యాణ్ మీడియా తో మాట్లాడుతూ .. నేను నటించిన తొలిప్రేమ సినిమా తరువాత రంగస్థలం సినిమాను థియేటర్ లో చూడాలనిపించింది. డైరెక్టర్ సుకుమార్ వాస్తవికతకు దగ్గరగా సినిమా రూపొందించారని,చరణ్ చక్కగా పెర్ఫార్మ్ చేసాడని మెచ్చుకుని ,మిగిలిన విషయాలను రంగస్థలం సక్సెస్ మీట్ లో మాట్లాడాలని నిర్ణయించుకున్నానని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here