మెగాస్టార్ సినిమాకు క్లాప్ కొట్టిన బాలకృష్ణ 

Balakrishna,మెగాస్టార్ సినిమాకు క్లాప్ కొట్టిన బాలకృష్ణ ,Balakrishna Clapped for Chiranjeevi Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Tollywood Movie Updates,Telugu Film News 2018,Nandamuri Balakrishna Clapped for Megastar Chiranjeevi Movie,Gharana Mogudu Movie Updates,Gharana Mogudu Telugu Movie Latest News,Gharana Mogudu Completes 26 years,Chiranjeevi gharana mogudu movie completes 26 years
దేవి ఫిలిం ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాఘవేంద్ర రావు దర్శకత్వంలో చిరంజీవి, నగ్మా నటించిన ఘరానా మొగుడు సినిమా బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రం తొలి షాట్ చిత్రీకరణకు నందమూరి బాలకృష్ణ క్లాప్ కొట్టారు. 1992 సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ ఘరానా మొగుడు సినిమా రిలీజయి 26 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

 

ఘరానా మొగుడు చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం నాడు చిరంజీవి, నగ్మాలపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి క్లాప్ నిచ్చిన బాలకృష్ణ

 

ఘరానా మొగుడు సినిమా రికార్డ్ కలెక్షన్స్ తో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి 56సెంటర్స్ లో శత దినోత్సవం,3 సెంటర్ లలో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. 10కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేసింది. చలన చిత్ర చరిత్రలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన మొదటి తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. చిరంజీవి నటన,డాన్స్ ఈ చిత్రానికి హైలెట్. ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకోండి అనే డైలాగ్ తో,ఒంగి నమస్కారం చేసే మేనరిజం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి స్వరకల్పనలో సాంగ్స్ సూపర్ హిట్. ముఖ్యంగా బంగారు కోడిపెట్ట సాంగ్ ట్రెండ్ సెట్టర్ అయింది. ఈ చిత్ర ఘన విజయంతో ఇండియా లోనే హైయెస్ట్ పైయిడ్ యాక్టర్ గా చిరంజీవి మారారు.
Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here