‘సిట్ – చీఫ్’ గా అవతారమెత్తిన ‘కింగ్ నాగ్’

సిట్ – చీఫ్ గా అవతారమెత్తిన కింగ్ నాగ్,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Movie Updates,King Naag To Be Reported As Sit Chief,Officer Movie Updates,Officer Telugu Movie Latest News,Officer Movie Teaser,Officer Telugu Movie Teaser,Akkineni Nagarjuna Role In Officer Movie,Kin Nagarjuna Character In Officer Telugu Movie

చాలా కాలం తరువాత నాగార్జున మళ్ళీ ఓ యాంగ్రీ కాప్ గా కనపడబోతున్నాడు. 1990 లో రాం గోపాల్ వర్మ – నాగార్జున ల కాంబినేషన్ లో వచ్చిన ‘శివ’ ఇండస్ట్రీలో ఓ సరికొత్త ట్రెండ్ ని సృష్టించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో ‘శివ’ అనే చిత్రం ఓ ప్రభంజనం అనే చెప్పాలి. మళ్ళీ ఇంత కాలం తరువాత వాళ్లిద్దరూ “ఆఫీసర్” అనే మరో యాక్షన్ థ్రిల్లర్ తో మన ముందుకు వస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ టీజర్ ని చిత్రం యూనిట్ నిన్న యూట్యూబ్ లో విడుదల చేసింది. ఇందులో ఒక ఆవేశపూరితమైన  పోలీస్ ఆఫీసర్ పాత్రలో నాగార్జున కనిపించారు. ఒక నిమిషం నిడివి గల ఈ టీజర్ లో రాం గోపాల్ వర్మ మార్క్ పిక్చరైజేషన్, కెమెరా యాంగిల్స్ సుస్పష్టంగా కనిపిస్తాయి. ఊపిరి, మనం వంటి చిత్రాల్లో సాఫ్ట్ రోల్స్ లో కనిపించిన నాగార్జున ఈ చిత్రంలో మ్యాచో లుక్ తో, తనదైన డైలాగ్ డెలివరీ తో ఆకట్టుకున్నారు. టీజర్ విడుదలైన అతి తక్కువ సమయంలోనే మిలియన్ల హిట్స్ తో యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ గా నిలిచింది.
మే 25న వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ చిత్రం అప్పటి శివ నాటి మ్యాజిక్ ని తిరిగి సృష్టిస్తుందో లేదో తెలియాలి అంటే రిలీజ్ వరుకు వేచి చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here