బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తిరగ రాస్తున్న రంగస్థలం సినిమా 

బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ తిరగ రాస్తున్న రంగస్థలం సినిమా,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Movie Updates,Rangasthalam Movie Updates,Recreating Box Office Records For Rangasthalam Movie,Rangasthalam Movie Updates,Rangasthalam Telugu Movie Latest News,Rangasthalam Movie Box Office Collections
 మైత్రీ మూవీస్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ,సమంత నటించిన రంగస్థలం సినిమా మార్చి 30 వతేదీ రిలీజయి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి భారీ కలెక్షన్స్ తో రికార్డ్స్  క్రియేట్ చేస్తుంది. రంగస్థలం పూర్తి గ్రామీణ చిత్రం గా రూపుదిద్దుకుంది. నటీనటుల పెర్ఫార్మెన్స్ ,టెక్నీషియన్స్ ప్రతిభతో సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాకు పనిచేసిన అందరూ ప్రశంసలు పొందుతున్నారు.
 టాలీవుడ్ ఇండస్ట్రీ లో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలలో బాహుబలి 2సినిమా 1700కోట్లరూపాయలతో నెం 1 గానిలిచింది. తరువాతి స్థానాలలో  బాహుబలి 600కోట్లు ,ఖైదీ నెం 150సినిమా 164 కోట్లు ,మగధీర 150కోట్లు ,శ్రీమంతుడు 144 కోట్లు ,జనతా గ్యారేజ్ 135కోట్లు ఉన్నాయి. ఈ కలెక్షన్స్ అన్నీ ఆ సినిమా ఫుల్ రన్ లో కలెక్ట్  చేసినవి. రంగస్థలం సినిమా 8రోజులలో 134 కోట్లు కలెక్ట్ చేసి జైలవకుశ ,సరైనోడు ,అత్తారింటికి దారేదీ సినిమా కలెక్షన్స్ త్రోసిరాజని 7వ ప్లేస్ లో ఉంది. మరి కొన్ని రోజులలో రంగస్థలం సినిమా 3వ ప్లేస్ లో ఉన్న ఖైదీ నెం 150 సినిమా కలెక్షన్స్ అధిగమించి మూడవ స్థానం లో నిలిచే అవకాశం ఉంది.
 ప్రముఖ హీరోలుపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,సూపర్ స్టార్ మహేష్ బాబు ,యంగ్ టైగర్ ఎన్టీఆర్,అంతర్జాతీయ ఖ్యాతి పొందిన డైరెక్టర్ రాజమౌళి,రంగస్థలం సినిమాను ,రామ్ చరణ్ నటనను పొగడ్తలతో ముంచెత్తారు. రంగస్థలం సినిమా రామ్ చరణ్ సినీ కెరీర్ లో యాక్టింగ్ పరం గా ,రెవెన్యూ పరంగా నెంబర్ వన్ చిత్రం గా నిలిచిపోతుందనడంలో అతిశయోక్తి లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here