మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కు బర్త్ డే విషెస్

మెగా స్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ సినీ రంగంలోకి “చిరుత “లా ప్రవేశించి డాన్సులు ,ఫైట్స్ అద్భుతం గా చేసి తనకంటూ ఒక ప్రత్యేక క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం లో రూపొందిన ఆ సినిమా సూపర్ హిట్టయి రామ్ చరణ్ కు సినీ ఫీల్డ్ లో సుస్థిర స్థానం ఏర్పరిచింది. రెండవ చిత్రం రాజమౌళి దర్శకత్వంలో “మగధీర “బ్లాక్ బస్టర్ గా నిలిచి 150 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్ట్ చేసి ,223సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుని రికార్డ్ సృష్టించింది. ఆ సినిమాతో రామ్ చరణ్ స్టార్ స్టేటస్ పొందారు. రామ్ చరణ్ నటించిన రచ్చ ,నాయక్ ,ఎవడు ,గోవిందుడు అందరి వాడేలే ,ధృవ సినిమాలు కమర్షియల్ గా విజయం సాధించాయి. బెస్ట్ యాక్టర్ గా 2 నంది ,2ఫిల్మ్ ఫేర్ ,2సినీ MAA ,2సంతోషం అవార్డ్స్ సొంతం చేసుకున్నారు.
2016 సంవత్సరంలో కొణిదల ప్రొడక్షన్ కంపెనీ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి మెగా స్టార్ చిరంజీవి తో ఖైదీ నెం 150సినిమా ను నిర్మించారు. వీవీ వినాయక్ దర్శకత్వం లో రూపొందిన ఆచిత్రం 4వారాలలో 150కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డ్ నెలకొల్పింది. ఇప్పుడు హై బడ్జెట్ తో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ను “సైరా ” గా నిర్మిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలోరామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా ఈ నెల 30 వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఆ సినిమా పై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. 27 వ తారీఖున పుట్టిన రోజు జరుపు కుంటున్న రామ్ చరణ్ తేజ్ మెగా అభిమానులకు ఏ గిఫ్ట్ ఇవ్వనున్నారో సస్పెన్స్.రామ్ చరణ్ కు హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ పేరుతో పోలో టీమ్ ఉంది.ట్రూ జెట్ పేరుతో హైదరాబాద్ బేస్డ్ ఎయిర్ లైన్స్ బిజినెస్ ఉంది. మాటీవీ వన్ ఆఫ్ ది బోర్డు డైరెక్టర్ గాఉన్నారు. రామ్ చరణ్ తేజ్ కు తెలుగు ఫిల్మ్ నగర్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here