ఫిదా అయిన శేఖర్ కమ్ముల

ఫిదా అయిన శేఖర్ కమ్ముల,Latest Telugu Movies News,Telugu Film News 2018,Telugu Filmnagar,Tollywood Movie Updates,Sekhar Kammula Praises Needi Naadi Oke Katha,Director Sekhar Kammula Impressed with Needi Naadi Oke Katha Film,Needi Naadi Oke Katha Latest News,Needi Naadi Oke Katha Movie Updates,Director Sekhar Kammula Next Film
ఫిదా అయిన శేఖర్ కమ్ముల

అప్పట్లో ఒకడుండే వాడు ,మెంటల్ మదిలో వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల హీరో శ్రీవిష్ణు ,వేణు ఉడుగుల దర్శకత్వంలో నటించిన “నాదీ నీదీ ఒకటే కధ” సినిమా ఈ నెల 23వ తేదీ రిలీజ్ కానుంది.ఈ సినిమా రిలీజ్ కు ముందే డైరెక్టర్ శేఖర్ కమ్ముల ,హీరోలు నారా రోహిత్ ,శర్వానంద్ వంటి ప్రముఖుల ప్రశంసలు పొందింది. పిల్లల కెరీర్ గురించి ప్రెజర్ చేసే తల్లిదండ్రులు రియలైజ్ అయ్యేలా రూపొందించబడింది. పిల్లల ఇష్ట పడేవాటిని గమనించకుండా ,తల్లిదండ్రులు తమ ఇష్టాఇష్టాలను పిల్లలపై రుద్ది వారిని ఫ్రస్టేషన్ గురి చేయడం,పిల్లల స్ట్రగుల్ వంటివి స్టూడెంట్స్ కు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు కొత్తవాడైనా బాగా డీల్ చేసాడు. డిఫరెంట్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేయడంలో హీరో శ్రీవిష్ణు సక్సెస్ అయ్యాడు.
ఆనంద్ ,గోదావరి ,హ్యాపీ డేస్ ,లీడర్ ,ఫిదా వంటి సక్సెస్ ఫుల్ సినిమాలు చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమా ప్రివ్యూ చూసి మాట్లాడుతూ .. నాదీ నీదీ ఒకటే కధ సినిమా కధ మనఅందరి కధలా ఉంది. సమాజానికి అవసరమయిన కధ ను ఎంతో అందంగా రూపొందించారని ,కొన్ని సంఘటనలు మనస్సుకు హత్తుకునేలా చిత్రీకరించారని ,ఇటువంటి సినిమాలు సమాజానికి చాలా అవసరమన్నారు. హీరో శ్రీవిష్ణు రాయలసీమ యాక్సెంట్ తో డైలాగ్స్ పలికి బాగా నటించారని ,కొత్త డైరెక్టర్ ఈ సినిమాను అద్భుతంగా రూపొందించాడని ప్రశంసించారు.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here