ప్రేక్షకులకు ,నందమూరి అభిమానులకు శుభవార్త.

Balakrishna announces good news to Nandamuri fans, Good News for Nandamuri Fans, Latest Telugu Movies News, Nandamuri Fans enjoy seeing their favorite actors both in film, Nandamuri fans in suspense, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Movie Updates, ప్రేక్షకులకు నందమూరి అభిమానులకు శుభవార్త

ప్రేక్షకులకు ,నందమూరి అభిమానులకు శుభవార్త. తండ్రీ తనయులు హరికృష్ణ ,కళ్యాణ్ రామ్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రాదారులుగా ఒక మల్టీ స్టారర్ చిత్రం రూపుదిద్దుకోబోతుందని సమాచారం. సోషల్ మీడియా లో నందమూరి అభిమానుల ఆనందానికి హద్దే లేదు.

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మూల స్థంభాలయిన ఎన్టీఆర్ ,ఏఎన్నార్ కలసి అనేక మల్టీ స్టారర్ చిత్రాలలో నటించారు. తరువాత తరంలోశోభన్ బాబు ,కృష్ణ కలసి నటించారు. ఎన్టీఆర్ ,రజనీకాంత్ ,కృష్ణ ,శోభన్ బాబు,మోహన్ బాబు లతోచిరంజీవి నటించిన విషయం తెలిసిందే. కాల క్రమేణా ప్రతీ హీరో కు అభిమానసంఘాలు ఏర్పడటం తో ఇద్దరు హీరోలు కలసి నటిస్తే మా హీరో కు ఇంపార్టెన్స్ ఇవ్వాలనే అభిమానుల ఇగో ల వల్ల మల్టీ స్టారర్ చిత్రాలకు బ్రేక్ పడింది. కధానుసారంగా సాంగ్స్ ,ఫైట్స్ ,సీన్స్ ఉంటాయి తప్ప, బలవంతం గా ఇరికిస్తే సినిమాలు ప్లాప్ అవుతాయి. అందువల్ల నిర్మాతలు మల్టి స్టారర్ చిత్రాలు నిర్మించడానికి వెనుకంజ వేస్తున్నారు.

ఇప్పుడిప్పుడే హీరో వెంకటేష్ మల్టీ స్టారర్ చిత్రాలకి ఆసక్తి చూపుతున్నారు. మహేష్ బాబు ,పవన్ కళ్యాణ్ ,రామ్ వంటి హీరోలతో వెంకటేష్ నటించారు, మల్టీ స్టారర్ చిత్రాల వలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని పరిశ్రమ పెద్దల అభిప్రాయం. ఈ తరుణంలో కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ చిత్రం నిర్మించాలనుకోవడం అభినందించ తగ్గ విషయమే.హీరో కళ్యాణ్ రామ్ స్వంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై ఈ చిత్రాన్ని కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నారని వార్త. కాగా దీనిపై అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ మల్టీ స్టారర్ ఫాంటసీ చిత్రం గా ఉండే అవకాశం ఉంది. ఈ వార్త నిజమయితే నందమూరి అభిమానులకు పండుగే.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here