కొత్త చిత్రం మొదలెట్టిన విజయ్ దేవరకొండ

కొత్త చిత్రం మొదలెట్టిన విజయ్ దేవరకొండ,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Vijay Deverakonda New Movie Launched,Actor Vijay Deverakonda Latest News,Hero Vijay Deverakonda Upcoming Movie News,Vijay Deverakonda Next Film Updates,Vijay Deverakonda Next Movie Launched

విజయ్ దేవరకొండ, అర్జున్ రెడ్డి సినిమాతో ఎనలేని క్రేజ్ ను సంపాదించి టాక్ అఫ్ ది టౌన్ గా మారాడు. ఇక ఇవాళే తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో చేయనున్న ఓ కొత్త సినిమాను పూజ కార్యక్రమాలతో లాంచ్ చేసుకున్నాడు. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని సమాచారం.

కథాపరంగా..విజయ్, రాజకీయ వారసుడిగా అరంగేట్రం చేసి, ప్రస్తుత రాజకీయాలను ఎలా ప్రభావితం చేశాడన్నదానిపై ఈ సినిమా నడవనుంది. అలాగే లవ్ బ్యాక్ డ్రాప్ కూడా ఉండనుందట. ఆల్రెడీ మెహ్రిన్ కౌర్ హీరోయిన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. గతంలో ఈ దర్శకుడు చియాన్ విక్రమ్ తో ఇంకొక్కడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు. ఈ కొత్త ప్రాజెక్టును స్టూడియో గ్రీన్ బ్యానర్ వారు నిర్మించనున్నారు. ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికొస్తే..టాక్సీ వాలా సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here