పాటలు లేకుండా సినిమా చేయనున్న వరుణ్ తేజ్

పాటలు లేకుండా సినిమా చేయనున్న వరుణ్ తేజ్,Telugu Filmnagar,Telugu Film News 2018,Latest Telugu Cinema Updates,Telugu Movies News,no songs in varun tejs next movie,Actor Varun Tej Movie News,Hero Varun Tej Next Film Updates,Varun Tej Upcoming Movie News,Varun Tej Next Film Updates

మెగా ప్రిన్స్ వరుణ్ తాజాగా తొలి ప్రేమ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక తరువాత సినిమా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. అంతరిక్షం ప్రధాన అంశంగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ జీరో గ్రావిటీలో అందుకు తగిన శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నెల నుండి జార్జియాలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

ఈ ప్రాజెక్టుపై తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఈ సినిమాలో ప్రత్యేకించి పాటలేవి ఉండవట. కేవలం కథలో ఘాడతను వివరిస్తూ బ్యాక్ గ్రౌండ్ లో ఓ థీమ్ ప్లే అవుతుందని తెలుస్తోంది. వరుణ్ తేజ్ ఇందులో వ్యోమగామిగా కనిపించనున్నాడు. జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, రాజీవ్ రెడ్డి ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. గతంలో సంకల్ప్ రెడ్డి తీసిన ఘాజీ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ ప్రాజెక్టుపై మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here