శాటిలైట్ రైట్స్ లో రికార్డు సృష్టించిన సాక్ష్యం

శాటిలైట్ రైట్స్ లో రికార్డు సృష్టించిన సాక్ష్యం,Telugu Filmnagar,Latest Telugu Movies News,Tollywood Film News 2018,Telugu Cinema Updates,Sakshyam Movie Updates,Sakshyam Telugu Movie Latest News,Bellamkonda Sreenivas Sakshyam Movie Satellite Rights,Sakshyam Movie Create New Record in Satellite Rights

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా నటిస్తున్న చిత్రం సాక్షం. శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరిదశల్లో ఉన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను ఓపెన్ చేసింది. ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులకు గాను 8కోట్ల భారీ ధర వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫిగర్ చూస్తే శ్రీనివాస్ కెరియర్ లోనే అతిపెద్ద మొత్తంగా చెప్పొచ్చు.

ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. శరత్ కుమార్, మీనాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గతేడాది బెల్లంకొండ శ్రీనివాస్ జయజానకి నాయక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సాక్ష్యం సినిమా విషయానికొస్తే త్వరలోనే మిగిలిన షూట్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలెట్టనుంది. ఈ యాక్షన్ సినిమాను అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మిస్తుండగా, శక్తి కాంత్ కార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here