నాగార్జున, నాని సినిమాలో కన్నడ స్టార్ హీరోయిన్

నాగార్జున నాని సినిమాలో కన్నడ స్టార్ హీరోయిన్,Telugu Filmnagar,Telugu Movies News 2018,Latest Telugu Film News,Tollywood Movie Updates,Shraddha Srinath bags Nag & Nani multi starrer,Actress Shraddha Srinath Latest News,Heroine Shraddha Srinath Next Film Updates,Shraddha Srinath Upcoming Movie With Akkineni Nagarjuna And Natural Star Nani

అక్కినేని నాగార్జున, నానిలు కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమాను చేయనున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఫిబ్రవరి 24 నుండి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా కన్నడ స్టార్ హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తాజాగానే శ్రీ రామ్ ఆదిత్య ఈ సినిమా స్టోరీని ఈమెకి వినిపించగా సుముఖంగానే ఉన్నారని తెలుస్తోంది. కేవలం ఇక సంతకాలు పెట్టడం మాత్రమే మిగిలుందట. ఈమె తమిళంలో వచ్చిన విక్రమ్ వేద ద్వారా ప్రేక్షకులకి బాగా చేరువయ్యారు. ఈ మల్టీ స్టారర్ స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉండనుండగా, వైజయంతీ మూవీస్ బ్యానర్ వారు నిర్మించనున్నారు. మరోవైపు నాగార్జున, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చేస్తుండగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నాని, కృష్ణార్జున యుద్ధం సినిమా చేస్తున్నాడు.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here