ఇంటర్నెట్ ని ఊపేసిన ఈ అమ్మడి సినిమా తెలుగులో రానుందా ?

ఇంటర్నెట్ ని ఊపేసిన ఈ అమ్మడి సినిమా తెలుగులో రానుందా,Telugu Filmnagar,Telugu Movies News 2018,Latest Telugu Film News,Tollywood Movie Updates,Priya Prakash Malayalam Movie To Release In Telugu,Malayalam Actress Priya Prakash Latest News,Heroine Priya Prakash Upcoming Movie News,Priya Prakash Movie Releasing In Telugu

గత రెండురోజులగా ఇంటర్నెట్ ని తన వాలు కళ్ళతో ఊపేస్తున్న భామ ప్రియా వారియర్. మలయాళంలో ఓరు ఆధార్ లవ్ పేరుతో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా తెరకెక్కేకింది. దీనికి సంబంధించి ప్రమోషనల్ సాంగ్ ను చిత్రబృందం వారు రిలీజ్ చేశారు. అందులో ప్రియా వారియర్ పలికించిన అందమైన హావభావాలు వైరల్ గా మారిపోయి యువత గుండెల్లో గిలిగింతలు పెట్టేసింది.

ఇక ఈ రేంజ్ లో క్రేజ్ వస్తుందని ఊహించని చిత్రబృందం వారు దీనిని క్యాష్ చేసుకోవాలనే నెపంతో ఈ చిత్రాన్ని మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీలో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేయాలనీ నిర్ణయించారని తెలుస్తోంది. మార్చి 3న రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్ నిన్ననే రిలీజ్ అయ్యి యు ట్యూబ్ లో టాప్ ట్రెండ్స్ లో నిలవడం విశేషం. ఒమర్ లులు దర్శకత్వం వహించగా, షాన్ రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలో నటించిన నటులంతా కొత్త వారు కావడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here