సూపర్ హిట్ డైరెక్టర్ తో చైతు, సమంతల సినిమా

శివ నిర్వణ, నానితో నిన్ను కోరి సినిమా తీసి మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టాడు. ఇప్పుడు తాజాగా స్టార్ కపుల్ సమంత, నాగ చైతన్యలకు పర్ఫెక్ట్ గా సరిపోయే కథను రెడీ చేసి వినిపించాడట. రొమాంటిక్ జోనర్ లో ఉన్న ఈ స్టోరీ బాగుండడంతో ఇద్దరు నటించడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఫుల్ స్క్రిప్ట్ రెడీ అవుతుందని సన్నిహిత వర్గాల సమాచారం.

ఈ ప్రాజెక్టుకి నిర్మాతలుగా సాహు గారపాటి, హరీష్ పెద్దిలు వ్యవహరించనున్నారు. ప్రస్తుతం వీళ్ళు నాని చేస్తున్న కృష్ణార్జున యుద్ధం సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే సమంత, చైతుల ప్రాజెక్టుకు సంబంధించి ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. మరోవైపు రామలక్ష్మిగా సమంత నటించిన రంగస్థలం టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అటు నాగ చైతన్య కూడ చందు మొండేటి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ సవ్యసాచి సినిమా షూటింగ్ లో బిజిగా ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here