మహానటి వాయిదా పడనుందా ?

అలనాటి నటి సావిత్రి గారి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం మహానటి. సుమంత్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించనుండగా, సమంత, దుల్కర్ సల్మాన్, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ తదితరులు నటిస్తున్నారు. ఇదివరకే విడుదలైన టైటిల్ లోగోకు ప్రేక్షకుల నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

ఇక మొదట్లో ఈ సినిమాను మార్చి 29న విడుదల చెయ్యాలని ప్లాన్ చేయగా, ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా విడుదల ఇంకా ఆలస్యం కావొచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా సినిమాలోని గ్రాఫిక్ వర్క్ ఇంకా పూర్తి కానందున, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం ఏర్పడిందని తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం భాషలలో నిర్మాతలు వైజయంతి మూవీస్ వారు నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here