రంగస్థలం సమంత టీజర్ రివ్యూ

రంగస్థలం సమంత టీజర్ రివ్యూ,Rangasthalam Samantha Teaser Review,Rangasthalam new Teaser response,Samantha Rangasthalam Teaser public talk ,Rangasthalam teaser,Samantha Rangasthalam 1985 Teaser Review,Rangasthalam latest updates, Samantha as Ramalakshmi in Rangasthalam,Telugu Film News, Telugu Filmnagar, Telugu Movies News 2018,#Rangasthalam

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం రంగస్థలం. విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలో సమంత, రామలక్ష్మీ పాత్రలో కనిపించనున్నారు. కొద్దిరోజుల క్రితమే చిట్టి బాబు పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం, ఇవాళ రామలక్ష్మీ పాత్రకు సంబంధించి ఇంట్రో టీజర్ ను రిలీజ్ చేశారు. మరి ఈ టీజర్ ఏ మేరకు వీక్షకులను మెప్పించిందో చూసేద్దామా.

సుకుమార్, సమంతకు సరికొత్త మేకోవర్ ఇచ్చి పక్కా పల్లెటూరి అమ్మాయిలా తయారుచేశాడు. లంగా వోణితో, ఎలాంటి మేకప్ లేకుండా 80లలో ఎలా ఉండేవారో అలాగే చూపించడం బాగుంది. మన రామలక్ష్మీ మంచి గడుసుపిల్లలా చూపించడానికి సైకిల్ ను తొక్కడం, పొలం పనులకు వెళ్లే సన్నివేశాలు చాలా అందంగా ఉన్నాయి. ఈమె వయ్యారానికి మన చిట్టి బాబు గుండెల్లో గొళ్ళెటేసి, ఈమె నడుస్తుంటే రంగస్థలం ఊరి ఊరికే పద్దెనిమిది ఏళ్ళు వచ్చినట్టు ఉంటుందండోయ్. టోటల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే రామలక్ష్మీ పాత్రలో సమంత ఒదిగిపోయి, పల్లెటూరి అమ్మాయిలు ఇలానే ఉంటారా అనే ప్రశ్నకు సమాధానంగా ఉంది. మరి అసలే మన చిట్టి బాబుకు ఏమి వినపడదు, మరి రామలక్ష్మీని ఎలాంటి మ్యాజిక్ చేసి తన ప్రేమలో పారేస్తాడో, సుకుమార్ వీరిద్దరిని ఎలా కలిపాడో తెలియాలంటే మార్చి 30వరకు ఎదురుచూడాల్సిందే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here