ఆ హీరోయిన్ తోనే ఇంకో సినిమా చేయనున్న విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ ప్రస్తుతం గీత ఆర్ట్స్ ప్రొడక్షన్ 2 బ్యానర్ పై పరుశురాం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో నెక్స్ట్ తాను చేయబోయే మరో ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా రష్మిక నే ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇలా సినిమా కూడ రిలీజ్ అవ్వకుండానే మరో సినిమాలో హీరోయిన్ గా ఎంపికవ్వడంతో టాక్ అఫ్ ది టౌన్ గా మారిపోయింది.

నూతన దర్శకుడు భరత్ చెప్పిన స్టోరీ లైన్ బాగుండడంతో విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వచ్చే సమ్మర్ లో రెగ్యులర్ షూటింగ్ జరపాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు. ఇక కథ విషయానికొస్తే ఈ సినిమాలో విజయ్, కాకినాడ కాలేజ్ కుర్రాడుగా కనిపిస్తాడని, మాట్లాడే యాస కూడా మొత్తం డిఫెరెంట్ గా ఉండబోతోందని సమాచారం. జస్టిన్ ప్రభాకర్ సంగీతం సమకూర్చనున్న ఈ ప్రాజెక్టు గురించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here