రవి తేజ, శ్రీను వైట్ల సినిమా షూటింగ్ వివరాలు

Actor Ravi Teja Next Film Updates, Amar Akbar Anthony Movie Updates, Amar Akbar Anthony Telugu Movie Latest News, Latest Tollywood Film News, Mass Maharaja Ravi Teja Upcoming Movie News, Ravi Teja Amar Akbar Anthony To Launch On, Ravi Teja New Film News, Telugu Cinema Updates, Telugu Filmnagar, Telugu Movies News 2018, రవి తేజ శ్రీను వైట్ల సినిమా షూటింగ్ వివరాలు

మాస్ మహారాజ్ రవి తేజ నటించిన టచ్ చేసి చూడు సినిమా గత వారమే ప్రేక్షకుల ముందుకు వచ్చి డివైడ్ టాక్ ను సొంతం చేసుకుంది. మరోవైపు రవి తేజ మరో రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఒకటి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేస్తున్న నేల టికెట్ కాగా మరొకటి శ్రీను వైట్ల దర్శకత్వంలో మోడలు కానుంది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకుని రెగ్యులర్ షూటింగ్ కు సిద్ధమైంది.

ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 19న అమెరికాలో మొదలు కానుందని తెలుస్తోంది. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాకు అమర్ అక్బర్ ఆంటోని అని టైటిల్ ఖరారు చేశారట. రవి తేజ ఇందులో మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనుండగా, ముగ్గురు హీరోయిన్స్ కూడా నటించనున్నారని సమాచారం. ఏప్రిల్ నుండి రవి తేజ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here