తొలిప్రేమపై అంతటా పాజిటివ్ టాక్ !

తొలిప్రేమపై అంతటా పాజిటివ్ టాక్,Positive Talk On Tholi Prema Movie Release,Telugu Filmnagar,Telugu Movies News 2018,Latest Tollywood Film News,Telugu Cinema Updates,Tholi Prema Movie Updates,Tholi Prema telugu Movie Latest News,Varun Tej Tholi Prema Movie Getting Positive Talk From The Audience

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం “తొలి ప్రేమ”. నూతన దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా, ఇంటెన్స్ లవ్ స్టోరీతో తెరకెక్కింది. ఫిబ్రవరి 9న ఓవర్సీస్ లో ప్రీమియర్స్ వేసుకుని, తెలుగునాట ఫిబ్రవరి 10న రిలీజ్ కానుంది. ఈ వారం రిలీజ్ కానున్న సినిమాల్లో తొలిప్రేమకే మంచి ప్రీ రిలీజ్ టాక్ నడుస్తుండడం విశేషం.

ఇదివరకే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ చాల కొత్తగా ఉండడంతో మంచి కంటెంట్ ఉందనే నమ్మకాన్నీ కలిగించాయి. ఎస్ థమన్ స్వరపరిచిన పాటలన్ని ఆడియన్సు ని బాగా మెప్పించడంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. రిఫ్రెషింగ్ గా అనిపిస్తున్న పోస్టర్స్, ప్రమోషన్స్ చేస్తున్న విధానం ఇవన్నీ కలిసి మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అవ్వడంలో సహాయపడ్డాయి. అలాగే ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమా కావడంతో ట్రేడ్ వర్గాల్లోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే చిత్ర సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందని, తప్పకుండా విజయం సాదిస్తుందని నమ్మకంతో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here