క్రేజీ ప్రాజెక్టులో నివేత

క్రేజీ ప్రాజెక్టులో నివేత,Telugu Filmnagar,Telugu Film News 2018,Latest Telugu Cinema Updates,Tollywood Movie News,Nivetha Thomas To Team Up With Ravi Teja Next,Actress Nivetha Thomas Latest News,Heroine Nivetha Thomas Upcoming Movie News,Nivetha Thomas Paired Up With Ravi Teja For His Next

మాస్ మహారాజ్ రవి తేజ ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేల టికెట్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా పూర్తయ్యాక శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రవి తేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం.

ఈ సినిమాలో నివేత థామస్ ను హీరోయిన్ గా తీసుకోవాలని చిత్రబృందం యోచిస్తున్నారని, ఇదివరకే కథను వినిపించగా..నటించడానికి సుముఖత చూపారని సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. మొదట్లో నేల టికెట్ సినిమాలో హీరోయిన్ గా నివేత నే నటించనుండగా కొన్ని అనివార్య కారణాలచేత అది కార్యరూపం దాల్చలేదు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టు అమర్ అక్బర్ ఆంటోని అనే డిఫరెంట్ టైటిల్ ను పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. మరోవైపు రవి తేజ తాజాగా నటించిన టచ్ చేసి చూడు సినిమా ఫిబ్రవరి 2న రిలీజ్ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here