కేరళకు వెళ్లనున్న చిరు

కేరళకు వెళ్లనున్న చిరు,Telugu Filmnagar,Latest Telugu Movies News 2018,Telugu Film News,Tollywood Cinema Updates,Sye Raa Narasimha Reddy Movie Updates,Sye Raa Narasimha Reddy Telugu Movie Latest News,Megastar Chiranjeevi Sye Raa Narasimha Reddy Movie Shooting Updates,Sye Raa Narasimha Reddy Movie Currebtly Shooting In Kerala

మెగాస్టార్ చిరంజీవి తన 151వ చిత్రాన్ని దేశంలోనే మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా సైరా నరసింహా రెడ్డి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ నెలలో పూజ కార్యక్రమం ద్వారా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళి మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. విరామం లేకుండా అప్పుడే రెండో షెడ్యూల్ మొదలవ్వాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల చేత వాయిదా పడింది.

ఇప్పడు వినిపిస్తున్న వార్తల ప్రకారం ఫిబ్రవరి 20 నుంచి రెండో షెడ్యూల్ కేరళలో మొదలవుతుందని తెలుస్తోంది. చిరు సహా మిగిలిన తారాగణం ఈ షెడ్యూల్లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో కిచ్చా సుదీప్, జగపతి బాబు, అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ ప్రాజెక్టును కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here