గ్యాంగ్ మూవీ రివ్యూ

Gang Movie Public Talk, Gang Movie Story, Gang Review, Gang Telugu Movie Live Updates, Gang Telugu Movie Public Response, Gang Telugu Movie Review, Gang Telugu Movie Review & Rating, Latest Telugu Movies News, Suriya Gang Movie Review, Telugu Film News 2018, Telugu Filmngar, Tollywood Cinema Updates, గ్యాంగ్ మూవీ రివ్యూ

సినిమా : గ్యాంగ్
నటీనటులు : సూర్య, కీర్తి సురేష్, రమ్య కృష్ణ
దర్శకత్వం : విగ్నేష్ శివన్
సంగీతం : అనిరుధ్ రవిచందర్
నిర్మాత : యూవీ క్రియేషన్స్

కథ : ఉత్తమ్ దాస్ (సూర్య) డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న ఓ సాధారణ పౌరుడు. ఇదే క్రమంలో తాను చదివిన చదువుకు ఉద్యోగం రాలేదని మనస్థాపం చెంది ఓ స్నేహితుడు ఆత్మ హత్య చేసుకుంటాడు. ఈ ఘటనతో చలించిపోయిన ఉత్తమ్ అసలు దీనికి ప్రధాన కారణం వ్యవస్థ అని తెలుసుకుంటాడు. మొదట వ్యవస్థలో నిజాయితీ ఉండాలని..అప్పుడే దేశం బాగుంటుందని భావిస్తాడు. ఇక తన స్నేహితుడికి జరిగిన దుస్థితితి మరెవరికి జరగకాకూడదని భావించి ఓ నిర్ణయం తీసుకుంటాడు. ఇక అప్పటి నుండి ఉత్తమ్ దాస్ ఏం చేశాడన్నదే మిగిలిన కథ.

విశ్లేషణ : ప్రస్తుత సమాజంలో ఎవ్వరికి వారు చదివిన చదువుకి తగిన ఉద్యోగం రావడం లేదు. కేవలం డబ్బున్న వాళ్ళు, పలుకుబడి ఉన్న వాళ్ళు మాత్రమే ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి మారాలని దర్శకుడు విగ్నేష్ శివన్ ఎంచుకున్న కథ చాల బాగుంది. ఇలాంటి ధోరణి మారాలని హీరో చేసే యుద్ధం బాగుంది. నిరుద్యోగిగా, సీబీఐ ఆఫీసర్ గా రెండు విభిన్నమైన పాత్రలు సినిమాకే హై లెట్ నిలిచాయి. నకిలీ సీబీఐ ఆఫీసర్ గా రాబరీ చేసే సన్నివేశాలను దర్శకుడు చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ సినిమాను ఒక్కసారిగా తిప్పేసి సెకండ్ హాఫ్ పై మంచి అంచనాలను పెంచేసింది.

దర్శకుడు ఈ కథను ఎంటర్ టైన్మెంట్ అంశాలతో జోడిస్తూ చెప్పడం వల్ల హీరో చేస్తున్న పోరాటంలో కాస్త ఇంటెన్సిటీ తగ్గునట్లు అనిపిస్తుంది. అలాగే భారీ సెక్యూరిటీ మధ్య చేసే రాబరీలను ఇంకాస్తా డిటైల్ గా చెప్పుంటే బాగుందని పిస్తుంది. హీరోయిన్ కీర్తి సురేష్ పాత్ర సాంప్రదాయబద్దంగా, కథలో మిళితమై ఉంది. అలాగే సెకండ్ హాఫ్ చాలా భాగం తమిళ ఫ్లేవర్ కాస్త ఎక్కువైనట్టు కనిపించినా, క్లైమాక్స్ లో మంచి మెసేజ్ ని ఇచ్చి మనల్ని ఆలోచింపజేసేలా ఉంది.

నటీనటుల పనితీరు : సూర్య ఇందులో నిరుద్యోగిగా, సీబీఐ ఆఫీసర్ గా రెండు విభిన్నమైన పాత్రల్లో అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. అలాగే ఈ సినిమాకు సూర్య సొంతంగా తెలుగు డబ్బింగ్ చెప్పుకోవడం వల్ల ఇంకాస్త ఇంటెన్స్ ఫీల్ కలిగింది. రమ్య కృష్ణ సినిమాలో కీలకమైన పాత్ర కావడంతో సినిమా ఆరంభం నుండి ప్రతి సన్నివేశంలో ఉంటూ బాగా ఇంటెన్స్ గా నటించారు. కీర్తి సురేష్ చాలా అందంగా కనిపిస్తూ..తన పాత్ర మేరకు బాగానే నటించింది. ఆర్ జె బాలాజీ కామెడీ టైమింగ్ మనల్ని కడుపుబ్బా నవ్విస్తుంది. నెగటివ్ షేడ్స్ పాత్రలో నటించిన కార్తిక్ కూడా చాలా బాగా నటించాడు.

సాంకేతిక విభాగం : ఈ సినిమా ప్లాట్ బాలీవుడ్ సినిమా స్పెషల్ 26 నుండి తీసుకున్నా మన సౌత్ ఇండియన్ వాళ్ళకి నచ్చేలా దర్శకుడు విగ్నేష్ శివన్ చేసిన మార్పులు, చేర్పులు చాలా బాగున్నాయి. అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించాయి. సినిమాటోగ్రాఫర్ దినేష్ కృష్ణన్ పనితనం మెచ్చుకోదగ్గదిగా, ప్రతి ఫ్రేమ్ చాలా క్లియర్ గా ఫ్రెష్ గా ఉంది. అలాగే ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ పర్ఫెక్ట్ రన్ టైం ను సెట్ చేసి ఎక్కడ బోర్ కొట్టకుండా చేశాడు.

చివరగా : గ్యాంగ్, చదువు పూర్తి చేసిన ప్రతి ఒక్కరు ఉద్యోగం సంపాదించాలని పరీక్షలు రాస్తారు. కానీ డబ్బు, పలుకుబడి ఉన్నవారికే అన్ని దక్కుతున్నాయని..వ్యవస్థలో ఈ ధోరణి మారాలని చేసిన మంచి చిత్రం.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here