జై సింహా మూవీ రివ్యూ

జై సింహా మూవీ రివ్యూ,Telugu Filmngar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,Jai Simha Movie Review,Jai Simha Telugu Movie Review,Jai Simha Movie Story,Jai Simha Telugu Movie Live Updates,Jai Simha Review,#NBK102 Movie Review,Jai Simha Movie Review & Rating,Jai Simha Telugu Movie Public Talk,Nandamuri Balakrishna Jai Simha Movie Public Response

సినిమా : జై సింహా
నటీనటులు : బాలకృష్ణ, నయనతార, హరి ప్రియా, నటాషా దోషి
దర్శకత్వం : కె ఎస్ రవికుమార్
సంగీతం : చిరంతాన్ భట్
కథ, మాటలు : ఎం. రత్నం
నిర్మాత : సి కళ్యాణ్
బ్యానర్ : CK ఎంటర్ టైన్మెంట్స్

కథ : నరసింహం(బాలకృష్ణ), గౌరి (నయనతార) కన్న బిడ్డను ఆమెకు తెలియకుండా విశాఖపట్నం నుండి కుంభకోణంకు తీసుకెళ్తాడు. అక్కడ ఆలయ ధర్మ కర్త మురళీ మోహన్ ఇంట్లో డ్రైవర్ గా చేరుతాడు. అదే సమయంలో ఆలయ ధర్మ కర్త కుమార్తె ధన్య (నటాషా దోషి) తన కారుతో యాక్సిడెంట్ చేస్తుంది. ఇక నరసింహం ఆ యాక్సి డెంట్ ను నేనే చేశానని నేరం తనపై వేసుకుంటాడు. ఈ పరిస్థితుల్లో అతనికి శత్రువులు ఎక్కవవుతారు. అలాగే ఓ ఏసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో అక్కడి నుంచి కూడా ఇబ్బందులు ఎక్కువవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుని బయలు దేరుతాడు. సరిగ్గా అప్పుడే గౌరీ తన బిడ్డను వెతుక్కుంటూ..కుంభకోణం చేరుకుంటుంది. ఇక ఆ పరిస్థితుల్లో నరసింహం ఏం చేశాడు ? అసలు గౌరికి నరసింహానికి గల సంబంధం ఏంటి ? వంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మిగిలిన సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ : దర్శకుడు కె ఎస్ రవికుమార్ ఎంచుకున్న కథ పాతదే అయినప్పటికీ బాలకృష్ణ శైలికి తగట్టు పర్ఫెక్ట్ గా మార్చడంలో సఫలమయ్యాడు. మాములుగా బాలయ్య సినిమాలలో ఎంట్రీనే ఎదో ఒక పాటతోనో, భారీ యాక్షన్ సీన్ తో మొదలవుతుంది. కానీ దర్శకుడు ఇందుకు భిన్నంగా చంటి బిడ్డతో ఆరంభించి కథలో ఎమోషనల్ కంటెంట్ ఎంతుందో ముందే చెప్పేసి సాఫీగా నడిపాడు. మధ్య మధ్యలో మాస్ ఫైట్స్, డైలాగ్స్ పెట్టి ఆధ్యంతం ఎంటర్ టైన్మెంట్ ను పంచాడు. అలాగే వీటితో పాటు కథను కూడా చెప్పి ఫస్ట్ హాఫ్ ను మంచి ట్విస్ట్ తో ముగించేశాడు. ఇక సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ పై ఎక్కువగా దృష్టి సారించిన దర్శకుడు..నయనతార, ప్రకాష్ రాజ్ లపై మంచి ఎమోషనల్ సీన్స్ ను రాసుకున్నాడు. బాలయ్య స్వచ్ఛమైన ప్రేమికుడిగా చూపించి..సమరసింహా రెడ్డి, నరసింహా నాయుడు వంటి సినిమాలలో ఉన్న బాలయ్యను ఇక్కడ చూడొచ్చు. క్లైమాక్స్ ని కూడా కె ఎస్ రవికుమార్ చాల వైవిధ్యంగా తెరకెక్కించి సఫలమయ్యాడు.

నటీనటుల పనితీరు : బాలకృష్ణ ఇందులో గల రెండు వైవిధ్యమైన పాత్రలలో అవలీలగా నటనలో మంచి వ్యత్యాసాన్ని చూపించాడు. ఫస్ట్ హాఫ్ లో పురోహితుల గొప్పతనం గురించి చెప్పే సంస్కృతం డైలాగ్స్ తో ఈలలు వేయించాడు. అమ్మ కుట్టి పాటలో డ్యాన్స్ లు ఇరగదీసి ఫ్యాన్స్ కి ఏం కావాలో అవన్నీ ఫుల్ మీల్స్ లో ఇచ్చి అలరించాడు బాలయ్య. ఇక హీరోయిన్స్ ముగ్గురున్నా..నయనతార పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అలాగే చాలా రోజుల తరువాత బ్రహ్మానందంకి ఫుల్ లెంగ్త్ కమెడియన్ రోల్ దక్కింది. నటాషా దోషి గ్లామర్ పాత్రలో మెరవగా, హరిప్రియ అల్లరిపిల్లగా కనిపించింది.

సాంకేతిక విభాగం : సంగీత దర్శకుడు చిరంతాన్ భట్ మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను, పాటలను అందించాడు. సినిమాటోగ్రాఫర్ సి. రామ్ ప్రసాద్ పనితనం చాలా బాగుంది. తెరపై కనిపించే ప్రతి సన్నివేశాన్ని చాలా ఫ్రెష్ గా చుపించాడు. ఎం. రత్నం డైలాగ్స్ కూడా కథకు తగట్టు ఉన్నాయి. సి కళ్యాణ్ పాటించిన నిర్మాణ విలువలు మెచ్చుకోదగ్గవిగా ఉన్నాయి.

చివరిగా : జై సింహా, స్వచ్ఛమైన ప్రేమికుడిగా..మంచి ఎమోషనల్ ఎలెమెంట్స్ తో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here