సంఘమిత్ర ఇప్పుడు ఓ కొలిక్కొచ్చింది

సంఘమిత్ర ఇప్పుడు ఓ కొలిక్కొచ్చింది,Telugu Filmnagar,Latest Telugu Film News 2018,Telugu Movies News,Tollywood Cinema Updates,Sangamithra Movie Updates,Sangamithra Telugu Movie Latest News,Sangamithra Movie Releasing Soon,Sangamithra Shooting Updates,Sangamithra Movie Shooting Will Starts From May Or April

బాహుబలి సాధించిన చారిత్రాత్మక విజయం చూసిన చాల మంది ఫిలిం మేకర్స్ తమలో దాగున్న విజన్ ను తెరపైకెక్కించాలని ప్రయత్నాలు మొదలెట్టేశారు. ఆలా పురుడు పోసుకుంటున్న తమిళ చిత్రమే సంఘమిత్ర. దర్శకుడు సుందర్ సి ఈ ప్రాజెక్టును తెరకెక్కించనున్నాడు. గత సంవత్సరమే లాంచ్ చేసిన ఈ ప్రాజెక్ట్ ఇంతవరకు పట్టాలెక్కక పోవడంతో అందరిలో కాస్తా అయోమయం ఏర్పడింది. అప్పట్లో శృతి హాసన్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో పెద్ద సంచలనమే అయ్యింది.

ఇప్పడు తాజాగా సుందర్ సి మాట్లాడుతూ “ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ 16 నెలలుగా జరుగుతోంది. వచ్చే మే లేదా ఏప్రిల్ నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలెడతాం. అలాగే మొదటగా గ్రాఫిక్స్ వర్క్ పూర్తి చేసి..టాకీ పార్ట్ పై దృష్టి సారిస్తామని తెలిపారు. ఈ సినిమాలో బాలీవుడ్ భామ దిశా పాఠానిని తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్య, జయం రవి హీరోలుగా కనిపించనుండగా, సత్య రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆర్ట్ డైరెక్టర్ గా శిబు సిరిల్ పనిచేయనుండగా, ఏ ఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చనున్నారు. దాదాపు 450 కోట్లతో శ్రీ తేనండాళ్ ఫిలిమ్స్ వారు నిర్మించనున్నారు.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here