హీరోయిన్ ని పట్టిన నిఖిల్

Actress Catherine Tresa Next With Actor Nikhil, Catherine Tresa Latest News, Hero Nikhil Upcoming Movie Actress, Heroine Catherine Tresa Upcoming Movie, Latest Telugu Movies News, Nikhil Next Film With Catherine Tresa, Nikhil Next Movie Heroine, Telugu Film News 2018, Telugu Filmnagar, Tollywood Cinema Updates, హీరోయిన్ ని పట్టిన నిఖిల్

ప్రస్తుతం తెలుగులో ఉన్న యంగ్ హీరోల్లో నిఖిల్ ఒకడు. సినిమా సినిమాకి వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినాను పెంచుకుంటున్నాడు. గతేడాది క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో కేశవ ద్వారా మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం కన్నడలో ఘన విజయం సాధించిన క్రీక్ పార్టీ సినిమాను కిర్రాక్ పార్టీ పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

ఇక ఈ జనవరి 19న మరో కొత్త సినిమాను లాంచ్ చేయనున్నాడు. అదేంటంటే గతేడాది తమిళంలో మంచి ఘనవిజయం సాధించిన కణితన్ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఇందులో హీరోయిన్ గా క్యాథెరిన్ త్రెసా ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఒరిజినల్ వర్షన్ లో కూడా ఈ ముద్దు గుమ్మే నటించడం విశేషం.దర్శకుడు TN సంతోషన్ ఈ తెలుగు రీమేక్ కి కూడా దర్శకత్వం వహించనున్నాడు. ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు ఈ ప్రాజెక్టుని నిర్మించనున్నాడు. త్వరలోనే ఈ రీమేక్ కి సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here