62 అవతారాల్లో బాలకృష్ణ

62 అవతారాల్లో బాలకృష్ణ,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2018,Tollywood Cinema Updates,A Whopping 62 Getups For Balayya In Ntr Biopic,Ntr Biopic Latest News,62 Getups For Nandamuri Balakrishna In Ntr Biopic,Balakrishna Getups In Ntr Biopic

నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం జై సింహా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ గారి బయో పిక్ లో టైటిల్ రోల్లో బాలయ్య నటించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి జననం నుండి సినిమా రంగంలో అయన ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం, మరణం వరకు ఆవిష్కరించనున్నారు. ఇందుకోసం బాలయ్య బాబు దాదాపు 62 అవతారాల్లో కనిపించనున్నాడు. ఇదే విషయాన్నీ స్వయంగా బాలకృష్ణ గారు మీడియా సమావేశంలో తెలిపారు. అలాగే ఇందులో తన పాత్రలో తానే నటించనున్నాడు.

ఇక జనవరి 18న ఎన్టీఆర్ గారు వర్ధంతి కావడంలో ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసం షూటింగ్ కూడా జరిపి, ఎలాంటి తప్పు దొర్లకుండా తేజ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అలాగే ఎన్టీఆర్ గారి సతీమణి బసవతారకం పాత్రలో సరిపోయే నటి కోసం బాగానే వెతుకుతున్నారు. ఇందుకోసం ఓ సాఫ్ట్ వేర్ సహాయంతో అచ్చం ఆమెలా పోలికలున్న వారిని కనిపెడుతున్నారు. మార్చి చివరి నుండి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్న ఈ సినిమాని బాలకృష్ణ చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here