పవన్ దెబ్బకు ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డులన్ని నేలమట్టం

Agnyaathavaasi Movie Pre Release Business, Agnyaathavaasi Movie Updates, Agnyaathavaasi Telugu Movie Latest News, Latest Telugu Cinema News 2018, Pawan Kalyan Agnyaathavaasi Telugu Movie Pre Business For Record Price, Telugu Film News, Telugu Filmnagar, Telugu Movies Updates, పవన్ దెబ్బకు ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డులన్ని నేలమట్టం
Agnyaathavaasi Pre Release Business details

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే మైలురాయి లాంటి 25వ చిత్రం అజ్ఞాతవాసి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కడంతో ఈ సినిమాపై ఇటు ప్రేక్షకుల్లోనూ అటు ట్రేడ్ వర్గాల్లోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ దాదాపు 150 కోట్ల వరకు జరిగింది. ఈ ఫిగర్ తో టాలీవుడ్ లో నాన్ బాహుబలి రికార్డును సృష్టించింది. అలాగే మన సౌత్ ఇండియాలో 150 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమాల్లో అజ్ఞాతవాసి చోటు దక్కించుకుంది.

జనవరి 10న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో తాజాగానే నిర్మాణాంతర కార్యక్రమాల్లో భాగంగా సెన్సార్ పూర్తి చేసుకుని UA సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. ఇదివరకే రిలీజ్ చేసిన టీజర్ కు మంచి స్పందన రావడంతో ట్రైలర్ ను కూడా త్వరలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ హీరోయిన్స్ గా నటించారు. అనిరుధ్ సంగీతం సమకూర్చగా, ఎస్ రాధా కృష్ణ నిర్మించారు. మరి ఏరియల్ వారీగా ఏ మేరకు బిజినెస్ చేసిందో చూసేద్దామా !!

నైజాం – 29 కోట్లు
సీడెడ్ – 16.20 కోట్లు
UA – 11.70 కోట్లు
గుంటూరు – 9 కోట్లు
ఈస్ట్ – 8.1 కోట్లు
కృష్ణ – 7 కోట్లు
వెస్ట్ – 6.75 కోట్లు
నెల్లూరు – 4.05 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం – 91.80
కర్ణాటక + తమిళనాడు + నార్త్ ఇండియా – 11.70
ఓవర్సీస్ – 19 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా మొత్తం – 122.50
శాటిలైట్ – 32 కోట్లు
ఆడియో – 2 కోట్లు
అజ్ఞాతవాసి మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ – 156.50 కోట్లు

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here