ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సిద్దమైన సూర్య

#GangOnJan12th, #GangPreRelease event at JRC Conventions on 5th January from 6 PM, Gang Movie Updates, Gang Telugu Movie Latest News, Latest Telugu Movies News 2018, Tamil Actor Suriya Gang Movie Pre Release Event, Telugu Cinema News, Telugu Filmnagar, Tollywood Movie Updates, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సిద్దమైన సూర్య

తెలుగునాట మంచి ఫ్యాన్ బేస్ ఉన్న తమిళ హీరోల్లో సూర్య ముందు వరుసలో ఉంటారు. అయన తాజాగా నటించిన చిత్రం గ్యాంగ్. విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సోషల్ మెసేజ్ తో రానుంది. ఆల్రెడీ టీజర్ ను రిలీజ్ చేయగా అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుని విడుదలపై మంచి అంచనాలను ఏర్పరుచుకుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా జనవరి 5వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నామని చిత్రబృందం తెలిపింది.

ఇక నిన్ననే తమిళ వెర్షన్ కు సంబంధించి సెన్సార్ పూర్తి చేసుకుని UA సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సూర్య సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా, అనిరుధ్ సంగీతం సమకూర్చారు. త్వరలోనే తెలుగు వెర్షన్ ఆడియో ను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. జనవరి 12న భారీ ఎత్తున రిలీజ్ కానున్న ఈ సినిమా యూవీ క్రియేషన్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here