ఎవ్వరు చేయలేని పని చేసిన విజయ్ దేవరకొండ

ఎవ్వరు చేయలేని పని చేసిన విజయ్ దేవరకొండ,Telugu Filmnagar,Latest Telugu Film News 2017,Tollywood Movies News,Telugu Cinema Updates,vijay deverakonda sweet gesture wins hearts,Actor Vijay Deverakonda Latest News,Hero Vijay Deverakonda Upcoming Movies,Vijay Deverakonda Next Films,Vijay Deverakonda Latest Surprise For Fans

విజయ్ దేవరకొండ, సౌత్ ఇండియా సెన్సేషనల్ స్టార్. హీరోగా నటించింది కేవలం మూడు సినిమాలైనా తన అద్భుతమైన నటనతో అటు ఫిలిం క్రిటిక్స్ మనసులను, ఇటు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమాతో సాధించిన ఫేమ్ అంతా ఇంతా కాదండోయ్. అలాగే బయట ప్రైవేట్ వేడుకలకు హాజరైనప్పుడు ఈ హీరో చూపిస్తున్న నార్మల్ ఆటిట్యూడ్ మూలాన యువత మొత్తం ఇతనికి జేజేలు కొడుతోంది.

ఇప్పుడు తాజాగా ఈ హీరో చేసిన అరుదైనపని వల్ల ఇండస్ట్రీ మొత్తం ఇతని గురించే మాట్లాడుకుంటోంది. అదేంటంటే క్రిస్మస్, న్యూ ఇయర్ ఫెస్టివల్స్ పురస్కరించుకుని..హైదరాబద్ రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. అలాగే కనిపించిన వారందరికీ గిఫ్ట్స్ ఇస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నా మీద ఇంత అభిమానం చూపిస్తున్న వీరందరికి నేను చేస్తున్న ఈ పని చాలా చిన్నది అంటూ తన స్వభావాన్ని మరో సారి చాటుకున్నారు. దీనికి సంబంధించి ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు. ఇక సినిమా గురించి మాట్లాడుకుంటే డైరెక్టర్ పరుశురామ్ తో ఒకటి, రాహుల్ తో ఒకటి సినిమాలు చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here