కొత్త బిజినెస్ మొదలెట్టనున్న రామ్ చరణ్

Latest Telugu Movies News, Mega Powerstar Ram Charan to enter theater business, Ram Charan and UV in movie theater business, Ram Charan Starts New Business, Telugu Film News 2017, Telugu Filmnagar, Tollywood Cinema Updates, కొత్త బిజినెస్ మొదలెట్టనున్న రామ్ చరణ్
కొత్త బిజినెస్ మొదలెట్టనున్న రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మంచి కథలను ఎంచుకుంటూ కెరియర్ కు అవసరమైన హిట్స్ ను అవలీలగా అందుకుంటున్నాడు. అటు నిర్మాతగా కూడా అవతారమెట్టి కొణిదెల ప్రొడక్షన్స్ ను మొదలెట్టి మెగాస్టార్ కమ్ బ్యాక్ ఫిలిం ఖైదీ నంబర్ 150 ను నిర్మించి మాసివ్ హిట్ ను అందుకున్నాడు. ఈ బ్యానర్ పై సైరా నరసింహారెడ్డి లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును మొదలెట్టాడు. అటు సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం సినిమాను చేస్తూనే ఈ ప్రాజెక్టు పనులను చక్కపెడుతున్నాడు. ఇప్పుడు తాజాగా మరో బిజినెస్ ను స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.

నిర్మాతలైన యూవీ క్రియేషన్స్ వారితో చరణ్ కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ థియేటర్స్ బిజినెస్ ను మొదలెట్టనున్నారట. దీని సంబంధించి ఆల్రెడీ చర్చలు కూడా జరిగాయని త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు రంగస్థలం సినిమాను దాదాపు 18 కోట్ల రూపాయలకు నైజాం హక్కులను యూవీ క్రియేషన్స్ వారు కొన్న సంగతి మనకు తెలిసిందే. తాజాగానే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు అన్నీ వర్గాల నుండి మంచి స్పందన రాగ మార్చి 30న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here