హలో సినిమాపై అఖిల్ కామెంట్స్

హలో సినిమాపై అఖిల్ కామెంట్స్,Akhil Akkineni Take On His Film Hello,Telugu Filmnagar,Latest Telugu Movies News 2017,Telugu Film News,Telugu Cinema Updates,Hello Movie Updates,Hello Telugu Movie Latest News,Akhil Akkineni Upcoming Movie Latest News,Akhil About Hello Movie
Akhil Comments on Hello Movie And Nagarjuna

అఖిల్ అక్కినేని, మొదటి సినిమా అఖిల్ భారీ పరాజయాన్ని ఇవ్వడంతో నెక్ట్స్ సినిమాపై ఆచి తూచి అడుగేలేసి హలో సినిమాను చేశారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చేసిన ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ తో మంచి హైప్ ను క్రియేట్ చేసుకుని రిలీజ్ పై మంచి అంచనాలను ఏర్పపరుచుకుంది. ఆల్రెడీ డిసెంబర్ 22న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడంతో ప్రమోషన్స్ కూడా వేగవంతం చేసేశారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన అఖిల్ ఈ హలో సినిమాపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవేంటో చూసేద్దామా.

అఖిల్ మాట్లాడుతూ ఫస్ట్ సినిమా తరువాత చాలా స్క్రిప్ట్స్ వచ్చాయి. కానీ ఏది నచ్చకపోవడంతో ఒకే చెప్పలేదు. ఈసారి చేయబోయే సినిమా మంచి కమ్ బ్యాక్ ఫిలిం కావాలని ఈ హలో సినిమా చేశాను. ఖచ్చితంగా ఈ మూవీ గేమ్ చేంజర్ అవుతుంది. విక్రమ్ కుమార్ గారు సినిమాను బాగా హ్యాండిల్ చేశారు. ఈ ప్రాజెక్టు రొమాంటిక్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిందని తెలిపారు. అలాగే తన నాన్న గారు అక్కినేని నాగార్జున గురించి మాట్లాడుతూ ఒక నటుడిగా ముప్పై ఏళ్ల ప్రయాణంలో నిర్మాతగా అనుసరిస్తున్న మేనేజ్మెంట్ స్కిల్స్ తన కెరియర్ ను పర్ఫెక్ట్ గా షేప్ చేసుకోవడానికి చాలా సహాయపడతాయని తెలిపారు. ఇక ఇవాళే హలో సినిమా ఆడియో రిలీజ్ ను జరుపుకోనుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here