రంగస్థలం 1985 ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతోందో

రంగస్థలం 1985 ఫస్ట్ లుక్ ఎలా ఉండబోతోందో,Rangasthalam First Look Poster Release Date Locked,Telugu Filmnagar,Telugu Movies News 2017,Latest Telugu Film News,Tollywood Cinema Updates,Rangasthalam Movie Updates,Rangasthalam Telugu Movie Latest News,#RangasthalamFirstLook,Rangasthalam Movie First Look Poster Release Date Confirmed,Ram Charan Rangasthalam Telugu First Look Poster Release Date Fixed,Rangasthalam 1985 Movie First Look Update

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రంగస్థలం 1985. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోవడంతో మెగా అభిమానులకు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. అదే సినిమా ఫస్ట్ లుక్. దీనిని డిసెంబర్ 8న సాయంత్రం 5:30 గంటలకు రిలీజ్ చేయనున్నామని చిత్రబృందం అధికారికంగానే తెలిపింది. ఇప్పటివరకు వర్కింగ్ స్టిల్స్ తోనే అందరిని మెస్మరైజ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు రాబోతున్న అఫీషియల్ లుక్ ఎలా ఉంటుందో అని అందరు మెగా అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు.

మరోవైపు సుకుమార్, తన హీరోలకు డిఫెరెంట్ లుక్ ఇవ్వడం మొదట్నుంచి అవలంబిస్తున్న పద్దతే. మహేష్ కు 1 నేనొక్కడినే, ఎన్టీఆర్ కు నాన్నకు ప్రేమతో సినిమాల ద్వారా మంచి స్టైలిష్ లుక్ ను ఇచ్చాడు. ఇక రంగస్థలం విషయానికొస్తే..పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో నడిచే ప్రేమకథ కాబట్టి చరణ్ కు పాతకాలం నాటి లుక్ ని ఇచ్చేశాడు. సినిమా విషయానికొస్తే..సమంత అక్కినేని హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతి బాబు, అనసూయలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆది పినిశెట్టి కూడా సినిమాను మలుపు తిప్పే పాత్ర చేస్తునట్టు సమాచారం. ఇకపోతే రీసెంట్ గానే బైక్ ఛేజ్ సీక్వెన్స్ పూర్తి చేసుకుని సమ్మర్ లో రావడానికి మెల్లగా రంగస్థలం ముస్తాబవుతోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here