జై సింహా ఆడియో డేట్ ఫిక్స్

జై సింహా ఆడియో డేట్ ఫిక్స్,Telugu Filmnagar,Telugu Movies News 2017,Latest Telugu Film News,Tollywood Cinema Updates,Jai Simha Movie Updates,Jai Simha Telugu Movie Latest News,Nandamuri Balakrishna Jai Simha Audio Release Date,Jai Simha Movie Audio Release Date Confirmed,Jai Simha Telugu Movie Audio Release Date Fixed,Jai Simha Audio Release Date Locked

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె ఎస్ రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా జై సింహా. షూటింగ్ ఆల్రెడీ చివరి దశకు చేరుకోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేశారు. ఇక ఈనెల 20న అమరావతిలో అభిమానుల సమక్షంలో జై సింహా ఆడియోను రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు గౌతమి పుత్ర శాతకర్ణి ఫేమ్ చిరంతన్ భట్ సంగీతం సమకూర్చడం విశేషం. ఇదివరకే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు అభిమానుల నుండి మంచి స్పందన లభించడంతో ఆడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు బాగానే ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్, రాజకీయాలఫై ఉండనుందని..బాలయ్య పాత్రను రవి కుమార్ చాలా పవర్ ఫుల్ గా తీర్చి దిద్దాడని సన్నిహిత వర్గాల సమాచారం. గతంలో కె ఎస్ రవి కుమార్ మంచి సూపర్ హిట్ సినిమాలు రూపొందించిన నేపథ్యంలో బాలయ్యకు ఈ ప్రాజెక్టు మంచి హిట్ సినిమా అవుతుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన నయనతార, నటాషా దోషిలు హీరోయిన్స్ గా నటించారు. జనవరి 12న రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని సి కె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సి కళ్యాణ్ నిర్మించారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here