సైరా ఫస్ట్ షెడ్యూల్ ఫుల్ డిటైల్స్

సైరా ఫస్ట్ షెడ్యూల్ ఫుల్ డిటైల్స్,Telugu Filmnagar,Telugu Movies News 2017,Latest Telugu Film News,Tollywood Cinema Updates,Sye Raa Narasimha Reddy Movie Updates,Sye Raa Narasimha Reddy Telugu Movie Latest News,Sye Raa Narasimha Reddy First Shooting Schedule,Sye Raa Narasimha Reddy Shooting Updates

మెగా స్టార్ చిరంజీవి తన 151వ సినిమా సైరా నరసింహా రెడ్డిని ఇవాళ ఉదయమే ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ ఇవాల్టీ నుంచి డిసెంబర్ 22 వరకు నిరవధికంగా జరగనుందని తెలుస్తోంది. ఆరంభం నుండే భారీ యుద్ధ సన్నివేశాలను తెఅరకెక్కించనున్నారని తెలుస్తోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ లీ విట్టకేర్ నేతృత్వంలో ఈ ఎపిసోడ్స్ ని చిత్రీకరించనున్నారు. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఆంగ్లేయులకు, భారతీయులకు మధ్య జరిగే యుద్ధ సన్నివేశాలు ఈ షెడ్యూల్లో జరగనున్నాయని తెలుస్తోంది.

ఈ సినిమా సైరా టీం అందరికి మరిచిపోలేని జర్నీగా ఉంటుందని నిర్మాత రామ్ చరణ్ తెలపడం విశేషం. ఈ సినిమాలో బిగ్ ని అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ లు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమాను దేశంలోనే మొట్టమొదటి సారి ఆంగ్లేయులపై తిరుగుబాటు చేసిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితగాథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ భారీ ప్రాజెక్టును దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మించనున్నారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here