ఆరంభంలోనే బిజినెస్ మొదలెట్టిన కృష్ణార్జున యుద్ధం

ఆరంభంలోనే బిజినెస్ మొదలెట్టిన కృష్ణార్జున యుద్ధం,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2017,Telugu Movie Updates,Krishnarjuna Yudham Movie Updates,Krishnarjuna Yudham Telugu Movie Latest News,Fancy Price For Nani Krishnarjuna Yudham Movie,Krishnarjuna Yudham Telugu Movie Starts Business

న్యాచురల్ స్టార్ నాని ఈ ఏడాది నిన్ను కోరి సినిమాతో వరుస ఏడో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే క్రమంలో నెక్స్ట్ రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. అందులో ఒకటి MCA మిడిల్ క్లాస్ అబ్బాయి, మరొకటి కృష్ణార్జున యుద్ధం. ప్రస్తుతం MCA సినిమా షూటింగ్ ఆఖరి దశల్లో చేరుకోగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలైపోయాయి. ఈ సినిమా ఈనెల 21 న రిలీజ్ కానుండడంతో టీజర్ ను, రెండు పాటలను ఇదివరకే రిలీజ్ చేశారు. వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

ఇదే క్రమంలో మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కృష్ణార్జున యుద్ధం సినిమా కూడా మెల్లగా మొదలైపోయింది. ఇందులో నాని డ్యూయల్ రోల్లో నటిస్తుండడంలో ట్రేడ్ సర్కిల్స్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా థియేట్రికల్ హక్కులను, శాటిలైట్ హక్కులను ఫ్యాన్సీ రేటుకు కొన్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో నాని సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించనుంది. ఫిబ్రవరి నాటికి అన్ని రకాల కార్యక్రమాలను పూర్తి చేసుకుని అదే నెలలోనే రిలీజ్ చేయాలనీ చిత్రబృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here