ఇవాంక ట్రంప్ తో ప్రసంగించనున్న రామ్ చరణ్

ఇవాంక ట్రంప్ తో ప్రసంగించనున్న రామ్ చరణ్,Ram Charan to Attend Ges 2017 Summit,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2017,Telugu Cinema Updates,Mega Power Star Ram Charan Latest News,Ram Charan To Speak At Ivanka Trump GES Summit 2017,Ram Charan Tej to speak at GES 2017

ఈనెల చివర్లో హైదరాబద్ లో జరగనున్న ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో (జీఈఎస్) రామ్ చరణ్ పాల్గొననున్నారు. ఈ సదస్సులో దాదాపు 170 దేశాల నుండి దాదాపు 1500 మంది పారిశ్రామిక వేత్తలు పాల్గొనబోతున్నారు. ఇందులో ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ కూడా ఉన్నారు. అందువల్ల తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసి..ఘనంగా ఆహ్వానించడానికి సిద్ధమైంది.

ఈ సదస్సులో నూతన ఆవిష్కర్తలు, పారిశ్రామిక వేత్తలు, సినిమా తారలు, క్రీడాకారులు పాల్గొని వారి ఆలోచనలను తెలపనున్నారు. ఇక మన సినీరంగానికి సంబంధించి..రామ్ చరణ్ ప్రసంగించనున్నారు. అలాగే చెలియా సినిమా ద్వారా పరిచయమైన అదితి రావు హైదరి కూడా ఈ సదస్సులో పాల్గొననున్నారు. మరోవైపు సినిమాల విషయానికొస్తే సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం 1985 సినిమాను రామ్ చరణ్ చేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here