సైరాలో విలన్ గా డైరెక్టర్ కొడుకు 

Chiranjeevi Upcoming Movie Updates, Dasari Arun Kumar Play Negative Role In Sye Raa Narasimha Reddy, Latest Tollywood Film News, Megastar Chiranjeevi 151st Film News, Megastar Signs Yet Another Member For Sye Raa Narasimha Reddy, Sye Raa Narasimha Reddy Movie Updates, Sye Raa Narasimha Reddy Telugu Movie Latest News, Sye Raa Narasimha Reddy Telugu Movie Villain, Telugu Filmnagar, Telugu Movies News 2017, Telugu Movies Updates, సైరాలో విలన్ గా డైరెక్టర్ కొడుకు
సైరాలో విలన్ గా డైరెక్టర్ కొడుకు

మెగాస్టార్ చిరంజీవి చేయనున్న సినిమా సైరా నరసింహ రెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనుంది. సినిమా లాంచ్ అయిన రోజునే నటీనటుల పేర్లను ప్రకటించగా..అందులో అమితాబ్ బచ్చన్, నయనతార, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్, జగపతి బాబులు ఉండడంతో సినిమాకు కావాల్సిన హైప్ అప్పుడే క్రియేట్ అయింది.

ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో చిరుకి విలన్ గా స్వర్గస్థులు దాసరి నారాయణ రావు గారి కుమారుడు దాసరి అరుణ్ కుమార్ నటిస్తున్నాడని తెలుస్తోంది. గతంలో అరుణ్ కుమార్ హీరోగా సినిమాలు చేసిన అవి అంతగా వర్క్ అవుట్ అవ్వలేదు. గతంలో దాసరి గారు చాల సంధర్భాల్లో అరుణ్ ని ఒక మంచి నటుడిగా పెద్ద స్థాయిలో చూడాలనుందని తన మనసులో మాట చెప్పే వాడు. ఆ మాట ప్రకారమే అరుణ్ ప్రస్తుతం సినిమాల్లో విలన్ గా నటించడానికి సన్నద్ధం అవుతున్నాడు. మరి ఇంత పెద్ద ప్రాజెక్టులో ఛాన్స్ రావడం అంటే మాములు విషయం కాదు కదా !. సో మరి ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించి దాసరి గారి కోరిక నెరవేరాలని తెలుగు ఫిలింనగర్ కోరుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here