సంచలన దర్శకుడితో రకుల్

సంచలన దర్శకుడితో రకుల్,Telugu Filmnagar,Telugu Movies News 2017,Tollywood Film News,Latest Telugu Movie Updates,Rakul Preet to act with Surya Under Selva Raghavan Direction,Actress Rakul Preet Singh Latest News,Heroine Rakul Preet Singh Next With Surya Under Selva Raghavan Direction,Rakul Preet Singh Upcoming Movie,Rakul Preet Singh Next Film

రకుల్ ప్రీత్, ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుసగా స్టార్ హీరోస్ సరసన నటిస్తూ టాప్ హీరోయిన్ అయిపోతోంది. ఇక తమిళ ఇండీస్ట్రీలో కూడా తన హవాను మొదలెట్టడానికి సర్వం సిద్ధం చేసుకుంటోంది. అందులో భాగంగానే తమిళ వెర్షన్ స్పైడర్ లో నటించి కాస్త చేరువ కాగా, కార్తీ తో స్ట్రెయిట్ తమిళ్ ఫిలిం తీరన్ అదిగారం ఒండ్రు’లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగులో ఖాకీ పేరుతో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఈ ముద్దు గుమ్మ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది.

అదేంటంటే సంచలన దర్శకుడు సెల్వ రాఘవన్ వచ్చే ఏడాది ఆరంభం నుండి సూర్యతో ఓ సినిమాను చేయనున్న సంగతి మనకి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నాని అఫీషయల్ గానే వెల్లడించింది. మాములుగా సెల్వ రాఘవన్ సినిమాలంటే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంటుంది. సూర్య, సెల్వ కాంబినషన్ మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్టు అని చెప్పొచ్చు. మరి అలాంటి ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా ఛాన్స్ అంటే గొప్ప విషయమే. మరి ఈ సినిమా తరువాత రకుల్ దశ ఏ రేంజ్ లో తిరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here