రోబో 2.0 సినిమా 3D మేకింగ్ వీడియో వచ్చేసిందోచ్

2.0 Movie New Making Video, Latest Tollywood News, Rajinikanth 2.0 Movie 3d Making Video Out Now, Superstar Rajinikanth robo 2 Movie Latest Making Video, Telugu Filmnagar, Tollywood Latest Film News, Tollywood Latest News, Tollywood News In Telugu, Tollywood News Today, రోబో 2.0 సినిమా 3D మేకింగ్ వీడియో వచ్చేసిందోచ్
రోబో 2.0 సినిమా 3D మేకింగ్ వీడియో వచ్చేసిందోచ్

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్ట్స్ లో రోబో 2.0 సినిమా ముందు వరుసలో ఉంటుంది. కారణం 2011లో సూపర్ స్టార్ రజినీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చి ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన రోబో సినిమాకి సీక్వెల్ గా వస్తున్న చిత్రమే ఈ రోబో 2.0. ఇందులో ప్రతినాయకుడిగా అక్షయ్ కుమార్ నటిస్తుండగా, అమీ జాక్సన్ హీరోగా నటించడం విశేషం. మరోవైపు షూటింగ్ మొదలై దాదాపు సంవత్సరంపైనే అవుతున్నా ఇంతవరకు టీజర్ ని మాత్రం రిలీజ్ చేయలేదు. కేవలం రజిని, అక్షయ్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని మాత్రమే రిలీజ్ చేసి రెండింతలు హైప్ ని పెంచేశారు. ఓక నెల క్రితం రోబో 2.0 సినిమా మేకింగ్ వీడియో ని రిలీజ్ చేయగా..మేకింగ్ వీడియో నే ఈ రేంజ్ లో ఉంటె సినిమా ఇంకే రేంజ్ లో ఉంటుందోనన్న ఆతృతను అందరిలో కలిగించారు. ఎలాగో 3D టెక్నాలజీలో ఈ సినిమా తెరకెక్కుతోంది కాబట్టి ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా 3D మేకింగ్ వీడియోను కూడా చిత్రబృందం కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేసింది. మరి ఈ వీడియోను ఏమాత్రం ఆలస్యం చేయకుండా చూసేయండి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here