భారీ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న పవన్ కళ్యాణ్

Latest Tollywood News, Long Europe Schedule For Pawan Kalyan PSPK25, Pawan Kalyan 25th Film Latest News, Powerstar Pawan Kalyan 25th Film Long Europe Schedule, PSPK25 Movie Shooting Updates, PSPK25 Movie Updates, Telugu Filmnagar, Tollywood Latest Film News, Tollywood Latest News, Tollywood News In Telugu, Tollywood News Today, భారీ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న పవన్ కళ్యాణ్
భారీ షెడ్యూల్ ప్లాన్ చేసుకున్న పవన్ కళ్యాణ్

టాలీవుడ్ లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్టుల్లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల సినిమా ఒకటి. దీని కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి ఎదురుచూస్తున్నారు. ఆల్రెడీ ఐదారునెలల క్రిందట షూటింగ్ మొదలెట్టుకుని చకా చకా పూర్తి చేసుకుంటుంది. ఇదేక్రమంలో రెండు వారల పాటు ఓ భారీ షెడ్యూల్ ను యూరోప్ లో ప్లాన్ చేసుకుంది. ఇందులో సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరణ జరుపుకుని, తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ రెండు షెడ్యూల్ కంప్లీట్ అయితే సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్టేనని తెలుస్తోంది.

గతంలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా టైటిల్ ను ప్రకటించడకుండా కేవలం కాన్సెప్ట్ పోస్టర్ ను చిత్రబృందం రిలీజ్ చేయగా..సినిమాకు కావాల్సిన హైప్ ను ఈ పోస్టర్ తీసుకురావడంలో సహాయపడింది. ఇందులో పవన్ ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపిస్తాడని సన్నిహితవర్గాల సమాచారం. కీర్తి సురేష్, ఇమ్మానుయేల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. హారిక హాసిని బ్యానర్ పై రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here